ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 22 మార్చి 2020 (12:22 IST)

జనతా కర్ఫ్యూకు జై కొడుతున్న శ్రీరెడ్డి.. రూటు మార్చేసిందిగా...?

వివాదాస్పద నటి శ్రీరెడ్డి ప్రస్తుతం రూటు మార్చింది. శ్రీ రెడ్డి ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తుందో చెప్పడం కష్టం. లేడీ రామ్ గోపాల్ వర్మలా మారిపోయింది శ్రీరెడ్డి.  అసలు ఈమె ఎప్పుడు ఎలా మారిపోతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. ఊసరవెల్లిలా రోజుకో రంగు మార్చేస్తూ ఇష్టమొచ్చినట్లు బతికేస్తుంది శ్రీ రెడ్డి.

ఇప్పుడు కూడా ఈమె తన ఫేస్ బుక్ పేజీలో నరేంద్ర మోదీకి జై కొట్టేసింది. మార్చ్ 22న కరోనా వైరస్ అరికట్టడానికి ప్రధాని మోదీ పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూకు శ్రీరెడ్డి కూడా మద్దతు ప్రకటించింది. 
 
ఇప్పటికే అవసరం అనుకుంటే రాజకీయాల్లోకి కూడా వస్తానని ప్రకటించింది. తమిళనాట తనకు పార్టీ టికెట్స్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని ఆ మధ్య చెప్పింది. తనకోసం తమిళ ప్రజల వేచి చూస్తున్నారని.. అక్కడికే వెళ్లిపోతానంటూ చెప్పుకొచ్చింది. ఇక్కడ జై జగన్, జై కేసీఆర్ అంటూ ఎప్పుడూ వీడియోలు పెట్టే శ్రీ రెడ్డి.. ఇప్పుడు నరేంద్ర మోదీకి కూడా జై కొట్టేసింది.