బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : మంగళవారం, 27 ఫిబ్రవరి 2018 (12:42 IST)

శ్రీదేవి గురించి ఇలా మాట్లాడుకుంటున్నారు.. చనిపోవాలనిపిస్తుంది: వర్మ

సినీనటి శ్రీదేవి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. ఆమె వీరాభిమాని ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ట్విట్టర్లో స్పందించారు. జరుగుతున్నదంతా చూస్తుంటే.. ''నన్ను నేనే చంపేసుకోవాలనిపి

సినీనటి శ్రీదేవి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. ఆమె వీరాభిమాని ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ట్విట్టర్లో స్పందించారు. జరుగుతున్నదంతా చూస్తుంటే.. ''నన్ను నేనే చంపేసుకోవాలనిపిస్తుంది'' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆమె మరణాన్ని తట్టుకోలేక ట్వీట్లపై ట్వీట్లు చేస్తూ వచ్చిన రామ్ గోపాల్ వర్మ.. శ్రీదేవికి సంబంధించి తాజాగా ట్వీట్ చేశారు. 
 
శ్రీదేవికి సంబంధించి.. అందరూ ఆమె శారీరక అందం, పెదవులు, కళ్లు గురించి మాట్లాడారు. ప్రస్తుతం ఆమె మృతదేహం, రక్తంలో మద్యం, ఊపిరితిత్తుల్లో నీరు... కడుపులో వున్న వాటి గురించి మాట్లాడుతున్నారు.. దేవుడా.. అంటూ ట్వీట్ చేశారు. 
 
మళ్లీ ఈ ట్వీటును రీ ట్వీట్ చేస్తూ.. ఒక మనిషి జీవితం ఇంత విషాదకరంగా.. భయంకరంగా ఎలా ముగుస్తుంది.. ఆమెను ఇంత కఠినంగా విచ్ఛిన్నం చేయడం ఎంతో భయానికి గురిచేస్తోందని.. ఆ విషయాన్ని తలచుకుంటేనే చనిపోవాలనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వర్మ ట్వీట్స్‌కు నెటిజన్లు విభిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.