ఆయన అడుగేస్తే.. షో మొదలేడితే.. బాప్ వచ్చేస్తున్నాడు.. ఎవరు?
మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున వంటి సీనియర్ హీరోలు వెండితెరతో పాటు బుల్లితెర ప్రేక్షకులని అలరించగా, ఇప్పుడు నందమూరి బాలకృష్ణ కూడా ఎంటర్‌టైన్ చేయడానికి సిద్ధం అయ్యారు. ఓటీటీ వేదికగా బాలకృష్ణ ఓ టాక్ షో చేయబోతున్న విషయాన్ని ఆదివారం ఆహా ఓ పోస్టర్ విడుదల చేసి ప్రకటించింది. ఆయన అడుగేస్తే.. షో మొదలేడితే.. టాక్ షోలన్నింటికీ బాప్ త్వరలో రానుంది..! పైసా వసూల్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు సిద్ధంగా ఉండండి అని పేర్కొంది.
అలాగే ఆహా వారు ఒక ప్రీ లుక్ పోస్టర్‌ని కూడా వదిలారు. దీనితో ఈ షో పై మరింత హైప్ పెరిగింది. అయితే ఇంకో ఇంట్రెస్టింగ్ అంశం ఏమిటంటే ఈ మొత్తం షోని ఒక పది ఎపిసోడ్స్‌గా ప్లాన్ చేస్తున్నారట. ఈ పది కూడా బాలయ్య మార్క్‌లో అదిరే లెవెల్లో ఉంటాయని ఇండస్ట్రీలో టాక్. ప్రస్తుతానికి అయితే దీపావళి కానుకగా ఈ షో స్టార్ట్ అవ్వనుంది అని టాక్ ఉంది.