మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 28 అక్టోబరు 2019 (15:14 IST)

జబర్ధస్త్ షో.. సుడిగాలి సుధీర్ రిస్కీ స్టంట్.. షాకైన నాగబాబు

దీపావళి సందర్భంగా సుధీర్, చంద్ర, చంటి కలిసి చేసిన ఉత్తమ పురుషులు ఈవెంట్‌లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచిన సుడిగాలి సుధీర్... ఈవెంట్ మధ్యలో ఉన్నట్టుండి ఓ రిస్కీ స్టంట్ చేశాడు. జబర్ధస్త్ షో ద్వారా తిరుగులేని పాపులారిటీ సాధించిన సుడిగాలి సుధీర్ కామెడీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే అలాంటి సుధీర్ ఉన్నట్టుండి ఓ రిస్కీ స్టంట్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. 
 
ఊపిరి తీసుకోకుండా కొంత సేపు తాను ఉండగలనని చెప్పిన సుధీర్... ఆ విషయాన్ని ప్రూవ్ చేసేందుకు నిమిషానికి పైగా నీళ్లలో ఉండిపోయాడు. సుధీర్ చేసిన ఈ రిస్కీ స్టంట్ చూసినంత సేపు ఈవెంట్‌లో ఉన్న అందరూ టెన్షన్ పడ్డారు. 
 
ఒక నిమిషం పది సెకన్ల పాటు నీళ్లలో ఊపిరి తీసుకోకుండా ఉన్నాడు. దీంతో చాలా విషయాల్లో కామెడీ చేసే సుధీర్... ఇందుకోసం ఎంతగానో ప్రాక్టీస్ చేశాడనే విషయం అతడు చేసిన రిస్కీ స్టంట్‌ను బట్టి అర్థమైంది. ఇక సుధీర్ చేసిన ఈ రిస్క్‌ను చూసి షాకైన నాగబాబు... అతడిని అభినందించాడు.