గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 21 సెప్టెంబరు 2019 (13:23 IST)

రష్మీని చెల్లెమ్మా అని పిలవమంటే? సుడిగాలి సుధీర్ ఏం చేశాడో తెలుసా? (video)

యాంకర్ రష్మీ, సుడిగాలి సుధీర్ ప్రేమ వ్యవహారం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరి మధ్య నడిచే కెమిస్ట్రీ, పంచ్ డైలాగులు, కొంటె చూపులు అన్నీ హైలైటే. తాజాగా రష్మిపై సుధీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. రష్మీని వదిలే ప్రసక్తే లేదని చెప్పాడు. ఓ జబర్దస్త్ ఎపిసోడ్‌లో రష్మీ-సుధీర్ జోడీని టార్గెట్ చేసేశారు జబర్దస్త్ కమెడియన్. 
 
సెప్టెంబర్ 27వ తేదీన ప్రసారం కాబోయే జబర్దస్త్ షో తాలూకు ప్రోమో విడుదల చేశారు మేకర్స్. ఇందులో రష్మీ, సుధీర్ జోడీ‌లపై షూట్ చేసిన సన్నివేశాలు హైలైట్ బాగా అవుతున్నాయి. బుల్లితెరపై రొమాంటిక్ జోడీగా పేరుతెచ్చుకున్న వీళ్ళు ఈ ప్రోమోలో మాములుగా హంగామా చేయలేదు. పైగా రష్మీని ఉద్దేశిస్తూ సుడిగాలి సుధీర్ చేసిన కామెంట్స్ స్పెషల్ కిక్ ఇస్తున్నాయి.  
 
ఓ స్కిట్‌లో భాగంగా కాలేజీ ఆడపిల్లలను ర్యాగింగ్ చేస్తూ ఈ ప్రోమో వీడియోలో కనిపించాడు సుడిగాలి సుధీర్. అయితే సుధీర్ ఆగడాలు చూసిన చమ్మక్ చంద్ర రంగంలోకి దిగి రష్మీని చెల్లెమ్మా అని పిలువ్ అంటూ ఫోర్స్ చేశాడు. దీంతో సుధీర్ ఫీలింగ్స్ చూసి ఆ పక్క రష్మీ జబర్దస్తీగా నవ్వేసింది.