Daily Horoscope
✕

బ‌న్నీ, సుక్కు మూవీకి ముహుర్తం కుదిరింది... ఎప్పుడో తెలుసా..?

Written By శ్రీ
Updated: సోమవారం, 5 ఆగస్టు 2019 (21:40 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా` సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నారు. దానికి కార‌ణం.. స‌రైన క‌థ‌తో సినిమా చేయాల‌నే. చాలా క‌థ‌లు విని ఆఖ‌రికి బన్నీ త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు బన్నీ సుకుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం.. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో `ఐకాన్ కనపడుటలేదు` అనే మరో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 
 
ఇలా వ‌రుస‌గా సినిమాలు ఓకే చెబుతున్నాడు కానీ... వరుస సినిమాలను ఎప్పటికీ పూర్తి చేస్తారోనని వార్తలు కూడా వినిపించాయి. అయితే... లేటెస్ట్‌గా బ‌న్నీ సుకుమార్ మూవీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని... ముహుర్తం కూడా పెట్టేసార‌ని టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇంత‌కీ ముహుర్తం ఎప్పుడంటే... సెప్టెంబర్ 18న ప్రారంభం అవుతుందట. వచ్చే ఏడాది సమ్మర్‌లో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారని తెలిసింది. 
 
మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రం ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందనుందట. మ‌రి.. ఈ సినిమాతో ఆశించిన విజ‌యం సాధిస్తాడో లేడో చూడాలి.

అన్నీ చూడండి

అక్టోబర్ 25, 2026 నాటి తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?

Cyclone Threat: అర్నాబ్ తుఫాను.. తెలంగాణ జిల్లాలకు రెడ్ అలెర్ట్

పాకిస్థాన్ వల్లే కాశ్మీరీలు ప్రాణాలతో ఉన్నారు : ఫరూక్ అబ్దుల్లా

మీసంతో పుట్టిన పసికందు.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో (video)

పంజాబ్‌లో కారు బీభత్సం : టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

అన్నీ చూడండి

ఎస్ఆర్ఎం వైద్య కాలేజీ ఆస్పత్రిలో 'ఏజ్ వెల్ ఇండియా'

కిడ్నీల పనితీరును మెరుగుపరిచే 5 సహజసిద్ధమైన పానీయాలు, ఏంటవి?

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఈ సీజన్‌లో సకాలంలో ముందస్తు ఆరోగ్య సంరక్షణ తీసుకోవాలి

అధునాతన TULSA-PRO ప్రోస్టేట్ క్యాన్సర్ చికిత్సను అందుబాటులోకి తెచ్చిన DSS ఇమేజ్‎టెక్

అల్లంలో దాగున్న ఆరోగ్య రహస్యాలు

తర్వాతి కథనం
Show comments