శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 11 మే 2020 (16:03 IST)

కరోనా మహమ్మారికి దండం.. సన్నీలియోన్ ఎక్కడుందో తెలుసా?

Sunny leone
2012లో బాలీవుడ్‌ చిత్రం జిస్మ్‌-2 తో అరంగేట్రం చేసిన సన్నీకి, హారర్‌ చిత్రం రాగిణి ఎంఎంఎస్‌-2 తో బ్రేక్‌ వచ్చింది. సన్నీ తెలుగు తెరపై తొలిసారి కరెంటు తీగ చిత్రంలో అతిధి పాత్రలో కనిపించింది. అనంతరం 2017లో రాజశేఖర్‌ చిత్రం గరుడ వేగలో ''డియో డియో'' అనే ప్రత్యేక గీతంతో కుర్రకారును ఉర్రూతలూగించింది. 
 
అప్పటి నుంచి తెలుగు తెరకు దూరంగానే ఉన్న ఆమె, కోకా కోలా అనే ద్విభాషా చిత్రంతో ఐటెం సాంగ్‌లో కనిపించనుందనే వార్త తెలుగు ప్రేక్షకులను గిలిగింతలు పెట్టింది. అయితే హిందీ, తెలుగు భాషల్లో చిత్రీకరణ మొదలైన ఈ చిత్రానికి లాక్‌డౌన్‌ కారణంగా అంతరాయం ఏర్పడింది. 
 
ఈ నేపథ్యం సన్నీలియోన్ కరోనాకు జడుసుకుని అమెరికాకు వెళ్లిపోయింది. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో తన భర్త డానియల్‌ వెబర్‌, కుమార్తె నిషా, కొడుకులు నోవా, ఆషర్‌లతో సహా సన్నీ లియోన్ అమెరికాకు జంప్ అయ్యింది.
 
పిల్లలు ఉన్నపుడు, ప్రాధాన్యత, ప్రాముఖ్యత వేరుగా వుంటాయి. మిగిలిన అన్నిటి కన్నా వారి క్షేమమే ముఖ్యమౌతుంది. కరోనా వైరస్‌ కనపడని వ్యాధి. దీని నుంచి మరింత సురక్షితంగా ఉండగలమని తాము అనుకునే చోటుకి వెళ్లేందుకు మాకు అవకాశం లభించింది. 
 
తాము లాస్‌ఏంజిల్స్‌లో ఉన్న మా ఇంట్లోని సీక్రెట్‌ గార్డెన్‌లో ఉన్నాం. మా అమ్మ ఉండి ఉంటే తను కూడా ఇలాగే చేయమని చెప్పేది. మిస్ యూ మామ్‌. హ్యపీ మదర్స్‌ డే అంటూ ట్విట్టర్‌లో వివరించింది. కాగా, తాము అమెరికాలోని తమ సొంత ఇంటిలో ఉన్నట్టు సన్నీ భర్త డానియల్‌ వెబర్‌ కూడా సోషల్‌ మీడియా పోస్ట్‌ ద్వారా ధృవీకరించారు.