శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 11 మే 2020 (15:58 IST)

నా పిల్లలకు జన్మినివ్వబోయే తల్లి నయన్... మాతృదినోత్సవ శుభాకాంక్షలు

Nayanatara
లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ తనకంటూ ఓ గుర్తింపును సంపాదించింది. ప్రభుదేవాతో ప్రేమకు బ్రేకప్ ఇచ్చిన తర్వాత నయన ప్రస్తుతం తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో ప్రేమాయణం సాగిస్తున్న సంగతి తెలిసిందే. 
 
వీరిద్దరూ ఇప్పటివరకు తమ బంధంపై బహిరంగంగా స్పందించలేదు. అయితే సోషల్ మీడియా ద్వారా మాత్రం ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమను ఎప్పటికప్పుడు వెల్లడిస్తున్నారు. 
 
తాజాగా మదర్స్ డేని పురస్కరించుకుని ఇన్‌స్టాగ్రామ్‌లో విఘ్నేష్ శివన్ చేసిన కామెంట్ హాట్ టాపిక్‌గా మారింది. ఓ పాపను ఎత్తుకున్న నయన్ ఫొటోను విఘ్నేశ్ పోస్టు చేశాడు. 
 
ఇంకా ఆ ఫోటోకు ''నా పిల్లలకు జన్మినివ్వబోయే తల్లి చేతుల్లో ఉన్న పాప తల్లికి మాతృదినోత్సవ శుభాకాంక్షలు" అని కామెంట్ చేశాడు. దీంతో విఘ్నేష్, నయన్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ మరోసారి వార్తలు జోరందుకున్నాయి.