ఆదివారం, 24 సెప్టెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 8 మార్చి 2023 (10:30 IST)

లాల్ స‌లాంలో వ‌ప‌ర్‌ఫుల్ పాత్ర చేస్తున్న సూపర్ స్టార్ రజినీకాంత్

Lal salam poster
Lal salam poster
లైకా ప్రొడ‌క్ష‌న్స్‌.  ఇప్పుడు ఐశ్వ‌ర్య రజినీకాంత్ ద‌ర్శ‌క‌త్వంలో ‘లాల్ సలాం’ సినిమా  రూపొందుతోంది. ఇటీవ‌ల పూజా కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ హోలీ సంద‌ర్భంగా ప్రారంభ‌మైంది. విష్ణు విశాల్‌, విక్రాంత్ హీరోలుగా న‌టిస్తోన్న ఈ చిత్రంలో సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు.
 
ఈ సందర్భంగా లైకా ప్రతినిధులు మాట్లాడుతూ ‘‘విభిన్నమైన సినిమాలకు లైకా ఎప్పుడూ ఆద‌ర‌ణ ఇస్తుంది. అందులో భాగంగా లాల్ స‌లాం సినిమాను నిర్మిస్తున్నాం. ఇందులో ఓ వ‌ప‌ర్‌ఫుల్ పాత్ర ఉంది. దాన్ని నెక్ట్స్ లెవ‌ల్‌కు తీసుకెళ్లే గొప్ప న‌టుడు కావాల‌ని, సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్‌గారిని రిక్వెస్ట్ చేశాం. మాతో ఉన్న అనుబంధంతో ఆయ‌న ఈ రోల్‌లో న‌టించ‌టానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. ఎనిమిదేళ్ల త‌ర్వాత ఐశ్వ‌ర్య ర‌జినీకాంత్ మ‌ళ్లీ మెగా ఫోన్ ప‌ట్టారు. మ‌రో లాల్ స‌లాం వంటి డిఫరెంట్ మూవీతో మ‌నల్ని అల‌రించ‌బోతున్నారు. ఈ చిత్రానికి ఆస్కార్ విన్న‌ర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. విష్ణు రామ‌స్వామి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు’’ అని తెలిపారు.