మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 25 నవంబరు 2022 (17:28 IST)

విష్ణు విశాల్ మట్టి కుస్తీ నుండి చల్ చక్కని చిలక పాట విడుదల

Vishnu Vishal, Aishwarya Lakshmi
Vishnu Vishal, Aishwarya Lakshmi
హీరో విష్ణు విశాల్ హీరోగా చెల్లా అయ్యావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా 'మట్టి కుస్తీ. 'ఆర్ టీ టీం వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్ లపై మాస్ మహారాజా రవితేజతో కలిసి విష్ణు విశాల్ నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలౌతోంది. 'మట్టి కుస్తీ' లో విష్ణు విశాల్ కు జోడిగా ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుండి చల్ చక్కని చిలక పాటని విడుదల చేశారు మేకర్స్. విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మిల అందమైన పెళ్లి పాటిది.
 
జస్టిన్ ప్రభాకరన్ ఈ పెళ్లి పాటని మళ్ళీ మళ్ళీ వినాలనిపించే క్యాచి ట్యూన్ గా కంపోజ్ చేశారు. రెహమాన్ పాటకు చక్కని సాహిత్యం అందించారు. హేమచంద్ర వాయిస్ పాటకు మరింత ఆకర్షణ తెచ్చింది. ఈ పెళ్లి పాటలో విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మిల కెమిస్ట్రీ చూడముచ్చటగా వుంది. ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించగా, సినిమాటోగ్రాఫర్ గా రిచర్డ్ ఎం నాథన్, ఎడిటర్ గా ప్రసన్న జికె పని చేస్తున్నారు.