గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : ఆదివారం, 13 అక్టోబరు 2024 (09:46 IST)

వినూత్నమైన కథతో రాబోతున్న నా నిరీక్షణ చిత్రాన్ని ప్రారంభించిన సురేష్ బాబు, దిల్ రాజు

Amardeep Chowdhary, Chaitanya Verma, Lishi Ganesh Kallapu, Ramya Priya
Amardeep Chowdhary, Chaitanya Verma, Lishi Ganesh Kallapu, Ramya Priya
దసరానాడు రామానాయుడు స్టూడియోలో సురేష్ బాబు ఆశీస్సులతో నా నిరీక్షణ చిత్రం పూజా కార్యక్రమాలు జరిగాయి. ముహూర్తపు సన్నివేశానికి దిల్ రాజు క్లాప్ కొట్టగా  రాజా రవీంద్ర స్క్రిప్ట్ అందజేశారు. నిర్మాత గణపతి రెడ్డి కెమెరా స్విచాన్ చేశారు. అనంతరం సురేష్ బాబు మాట్లాడుతూ ..నా నిరీక్షణ చిత్రానికి ఆల్ ది బెస్ట్ తెలిపారు.
 
అమర్ దీప్ హీరోగా, లిషి గణేష్  కల్లపు హీరోయిన్‌గా సాయి వర్మ దాట్ల దర్శకత్వంలో రాబోతోన్న ‘నా నిరీక్షణ’ చిత్రం పికాక్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద పి. సంతోష్ రెడ్డి నిర్మాణంలో శ్రీకారం చుట్టారు.
డైరెక్టర్ సాయి వర్మ దాట్ల మాట్లాడుతూ, వినూత్నమైన కథతో ముందుకు రాబోతున్నాం.  ఓ మంచి చిత్రాన్ని అయితే తీస్తున్నాను. త్వరలో మరిన్ని వివరాలు తెలియజేస్తామని అన్నారు.
 
అమర్ దీప్ మాట్లాడుతూ.. ‘హీరోగా ఇది నా రెండో చిత్రం. బిగ్ బాస్ తరువాత సెలెక్ట్ చేసుకున్న ఫస్ట్ స్క్రిప్ట్ ఇది. దర్శక, నిర్మాతలు ఈ మూవీ మీదే ఏడు నెలలు పని చేశారు. వారి వల్లే ఈ మూవీ ఇక్కడికి వరకు వచ్చింది.నన్ను నమ్మి ఇంత మంచి అవకాశం ఇచ్చిన వారికి థాంక్స్’ అని అన్నారు.
 
లిషి గణేష్  కల్లపు మాట్లాడుతూ.. ‘ఇది నా రెండో చిత్రం. ఇంత మంచి పాత్రను తనకు ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. ఆడియెన్స్ మా సినిమాను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
 
చైతన్య వర్మ మాట్లాడుతూ, ఇది వరకు నన్ను హిట్, ఝాన్సీ, సరెండర్ వంటి సినిమాల్లో చూశారు. ఈ చిత్రంలో నాకు మంచి పాత్ర లభించింది. మా చిత్రాన్ని ఆడియెన్స్ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
 
ఈ చిత్రానికి తిరుమలేష్ బండారు మాటలు అందిస్తుండగా.. వి.రవి కుమార్ కెమెరామెన్‌గా పని చేయనున్నారు. శేఖర్ చంద్ర సంగీత సారథ్యంలో ఈ మూవీ రానుంది.
నటీనటులు: అమర్‌దీప్ చౌదరి, చైతన్య వర్మ, లిషి గణేష్ కల్లపు, రమ్య ప్రియ తదితరులు