శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 4 జూన్ 2018 (17:19 IST)

హైదరాబాదులో సైరా యాక్షన్ సీన్స్.. కొరటాల సినిమాలో చిరు రోల్?

మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను మెగాస్టార్ తనయుడు చరణ్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను చి

మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను మెగాస్టార్ తనయుడు చరణ్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. త్వరలోనే భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను కూడా ప్లాన్ చేస్తున్నారని సినీ యూనిట్ వర్గాల సమాచారం. 
 
బ్రిటీష్ సైన్యంపై ''ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి'' దాడి చేసే సన్నివేశాలను చిత్రీకరించేందుకు హైదరాబాదులో భారీ సెట్స్ వేస్తున్నారు. ఈ సన్నివేశాలను ఉత్కంఠభరితంగా .. అత్యంత ఆసక్తికరంగా చిత్రీకరించనున్నారట. బ్రిటీష్ సైనికులతో నరసింహా రెడ్డి తలపడే సన్నివేశాలు ఈ సినిమాకి హైలైట్‌గా నిలుస్తాయని సినీ యూనిట్ అంటోంది. వచ్చే వేసవిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం అవుతుంది. 
 
మరోవైపు సైరా చేస్తూనే కొరటాల శివతో సెట్స్‌పైకి వెళ్లడానికి చిరు రెడీ అవుతున్నారు. కొరటాల వినిపించిన కథకి చిరూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఈ సినిమా నేపథ్యం ఎలా ఉంటుందని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో బిలియనీర్ అయిన ఎన్నారై గాను.. ఓ మారుమూల గ్రామంలోని రైతుగాను రెండు విభిన్నమైన పాత్రల్లో చిరంజీవి కనిపించనున్నారనేది తాజా సమాచారం.