సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By srinivas
Last Updated : ఆదివారం, 27 మే 2018 (16:16 IST)

మెగాస్టార్ "సైరా" సైలెంట్ అయ్యింది... అస‌లు.. ఎంత వ‌ర‌కు వ‌చ్చింది..?

మెగాస్టార్ చిరంజీవి - స్టైలీష్ దర్శకుడు సురేంద‌ర్ రెడ్డి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం "సైరా న‌ర‌సింహారెడ్డి". ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్‍‌పై రామ్ చ‌ర‌ణ్ ప్ర‌తిష్టాత్మ‌కంగా

మెగాస్టార్ చిరంజీవి - స్టైలీష్ దర్శకుడు సురేంద‌ర్ రెడ్డి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం "సైరా న‌ర‌సింహారెడ్డి". ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్‍‌పై రామ్ చ‌ర‌ణ్ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నాడు. ఆమ‌ధ్య అమితాబ్, చిరంజీవి, న‌య‌న‌తార‌లపై కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించారు. ఆ త‌ర్వాత 'సైరా' సైలెంట్ అయ్యింది. అస‌లు ఏం జ‌రుగుతోంది అని ఆరా తీస్తే... జూన్‌ మొదటివారం నుంచి నర్సింహా రెడ్డి సమరానికి సిద్ధం అవుతారట. తొలకరి జల్లులు కురిసే సమయానికి తిరుగుబాటు మొదలు పెట్టనున్నారని తెలిసింది.
 
నయనతార, తమన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్‌ జూన్‌ 5నుంచి ప్రారంభంకానుంది. హైదరాబాద్‌లో వేసిన ఓ భారీ సెట్‌లో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారట చిత్రబృందం. ఈ షెడ్యూల్‌లో చిరంజీవి, మరికొందరు ముఖ్య నటీనటులు పాల్గొంటారు. ‘సైరా’ మూవీలోకి లేటెస్ట్‌గా ఎంట్రీ ఇచ్చిన తమన్నా ఈ షెడ్యూల్‌లో జాయిన్‌ అవ్వరట. ఆగస్ట్‌లో జరగబోయే  మరో కొత్త షెడ్యూల్‌లో జాయిన్‌ అవుతారని సమాచారం. ఇక ఈ  భారీ చిత్రాన్ని ఏడాది రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నార‌ని తెలిసింది.