బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 19 డిశెంబరు 2023 (14:17 IST)

సినిమా ఇండస్ట్రీ హీరో తేజ్ సజ్జను చిన్నచూపు చూస్తుందా?

Tej sajja
Tej sajja
ఇంద్ర సినిమాలో బాలనటుడిగా పరిచయమై ఆ తర్వాత హీరోగా ఎదిగి జాంబి రెడ్డి వంటి సినిమా చేసినా ఇంకా తనను చిన్నపిల్లాడిగా చూస్తున్నారంటూ తేజ్ సజ్జ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దర్శకుడు ప్రశాంత్ వర్మతో జాంబి రెడ్డి చేసిన ఆయన తాజాగా హనుమాన్ అనే పాన్ వరల్డ్ సినిమా కూడా చేశాడు. హైదరాబాద్ లో ఈ రోజే ట్రైలర్ విడుదలయింది. ట్రైలర్ హీరో స్థాయిని మించి వుందనిపించింది. దీనిపై సీనియర్ ఒకరు వేసిన ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం.
 
సెకండ్ జనరేషన్ నుంచి వచ్చిన వారిని ఈ ప్రశ్న మీరెందుకు అడగరు? నేను సినిమానే లోకం  అనుకుని చిన్నప్పటినుంచి ఇక్కడే వుండి పెద్దయ్యాక సినిమాలు చేస్తుంటే తెలుగులో కొందరు చిన్న చూపు చూస్తున్నారు. నేను వేరే హీరోలతో కంపేర్ చేసుకోవడం లేదు. నాకు హనుమాన్ అనే అవకాశం ఇచ్చింది. నాకు సినిమా ఇచ్చింది అందుకే మంచి ఎపెట్ పెట్టాను.  భగవంతుడి నాకు ఈ సినిమా ఇచ్చాడు. దీనిని ఎవరూ లాక్కోలేరు అంటూ ముగించారు.