1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 18 మార్చి 2023 (19:29 IST)

రంగ మార్తాండ సినిమా చూడవద్దు అంటున్న నిర్మాత

Rangamarthanda
Rangamarthanda
మార్చి 22 వ తేదీన విడుదల అవుతున్న రంగ మార్తాండ సినిమా చూడవద్దు అని నిర్మాత రామసత్యనారాయణ తెలిపారు. గత కొద్దిరోజులుగా సినీ ప్రముఖులు ఈ సినిమాను తిలకించారు. దర్శకులు తేజ, క్రిష్, విజేంద్రప్రసాద్, ఆర్. నారాయణ మూర్తి, పలు నిర్మాతలు, మహిళా సంఘాలు తిలకించారు.  నిర్మాత రామసత్యనారాయణ ఇలా చెపుతున్నారు. ఎందుకంటే ఇందులో ఫైట్స్ లేవు క్లబ్ డాన్స్ లు లేవు.శృంగారం లేదు.. కానీ గుండెల్ని పిండే సెంటిమెంట్ ఉంది..
 
ఈ చిత్రం లో మీ పాత్ర వుంది..నువ్వు తండ్రి వి ఐతే నీకు నచ్చుతుంది..నువ్వు ఒక కొడుకువి ఐతే నీకు నచ్చుతుంది.నువ్వు ఒక కూతురు వి ఐతే నీకు నచ్చుతుంది..అంటే ఒక ఇంటిలో వుండే అన్ని పాత్రలకు ఇదీ కచ్చితంగా నచ్చుతుంది.
 
ముందు నువ్వు చుస్తే 100 మందికి నువ్వే చెబుతావు.చూడమని. రంగ మార్తాండ సినిమా ఇదీ హిట్ సినిమా ఎందుకంటె. సూపర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు కృష్ణ వంశీ . మహోన్నతమైన నటులు ప్రకాష్ రాజ్.బ్రహ్మనందం, రమ్యకృష్ణ. యంగ్ హీరో నాటు నాటు ఆస్కార్  సింగర్.సింప్లీ గంజ్, జీవిత గారి అమ్మాయి *శివాత్మిక . ఎంత గొప్పగా నటించింది అంటే ఈ అమ్మాయి మన అమ్మాయి ల ఉంది కధ అనే లాగా నటించింది.
ఇక సినిమా కి ప్రాణం సంగీతం గొప్ప music డైరెక్టర్ ఇళయరాజా ఈ సినిమాకి సంగీతం అల్ రెడి సాంగ్స్ హిట్. రంగ మార్తాండ కి కథే ప్రాణం.ఇదీ మరాఠీ నట సామ్రాట్ సూపర్ హిట్ రీమేక్ ..
మీరు మంచి సినిమా వస్తే చూస్తాను అంటారు కధ మీ పెట్టుబడి టికెట్ 100 రూపాయలు పెట్టి సినిమా చూడండి 1000 రూపాయలు అనుభూతిని పొందుతారు.  కళ్ళ నీళ్లతో బయటి వచ్చి కృష్ణ వంశీ ఎంత ఎడిపించాడు రా అని అంటారు.. బాగుంటే కృష్ణ వంశీ ని తిట్టండి(ఎడిపించినందుకు) బాగోక పోతే నన్ను తిట్టండి.ఇంత సోది చెప్పినందుకు అంటూ తన శైలి లో చెప్పారు.