ఆదివారం, 14 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 19 జనవరి 2023 (22:26 IST)

రాకెట్‌ రాఘవకు అభినందనలు ?

Rocket Raghava
Rocket Raghava
టీవీ ఆర్టిస్టు, జబర్‌దస్త్‌లో పలు స్క్రిట్‌లు వేసే రాకెట్‌ రాఘవకు మంచి ఫాలోయింగ్‌ వుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌ ఆయనకు అభిమానులుగా వున్నారు. తను చేసే స్కిట్‌లో కొత్త తరహా ఫార్మెట్‌లో వుంటూనే పాత చింతకాయపచ్చడికూడా అప్పుడప్పుడు చూపిస్తుంటాడు. అయితే తాజాగా ఆయన రచనలో వచ్చిన సరికొత్త టీవీ ఎపిసోడ్‌ ఆకట్టుకుందని తెలుస్తోంది. తను టీవీ యాంకర్‌గా ఆ ఎపిసోడ్‌లో వుంటాడు. ఓ సీరియల్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారన్నమాట. ఇప్పటికి 5లక్షల ఎపిసోడ్‌ వరకూ రన్‌ అవుతూనే వుంటుంది.
 
దీన్ని ఆయన చెబుతూ.. బెండకాయ్‌ దొండకాయ్‌ నా మొగుడు గుండెకాయ్‌ అనే ఈ సీరియల్‌ను ఆడియన్స్‌ ఎంకరేజ్‌ చేస్తున్నారు. ఇప్పటికి 5వేల ఎపిసోడ్‌లో హీరోయిన్‌ పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు 5లక్షల ఎపిసోడ్‌కు తిరిగి వస్తుంది. వచ్చేటప్పుడు ఏమి తెస్తుంది? చూడాలంటే.. సరికొత్త ఎపిసోడ్‌ బెండకాయ్‌ దొండకాయ్‌ నా మొగుడు గుండెకాయ్‌ అనే మా సీరియల్‌ను చూడండి.. అంటూ రాఘవ చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఈ ఎపిసోడ్‌పై పలువురు స్వచ్చంధ సంస్థలతోపాటు వంశీ అవార్డు అధినేత వంశీరామరాజు స్పందిస్తూ, రాబోయే అవార్డును రాఘవకు ఇవ్వాలనుకుంటున్నామని వెల్లడిరచారు. గురువారంనాడు రవీంద్రభారతిలో వంశీ అవార్డుల కార్యక్రమం జరిగింది. ప్రముఖ నిర్మాత రామసత్యనారాయణకు శోభన్‌బాబు శత చిత్ర నిర్మాణ పురస్కారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతుండగా, సీరియల్స్‌ కూడా అవార్డులు ఇస్తారా! అని విలేకరి సరదాగా అడిడితే అందుకు ఆయన సరదాగా పైవిధంగా స్పందించారు.