శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 28 ఫిబ్రవరి 2022 (11:44 IST)

మంచు విష్ణు కార్యాలయంలో చోరీ - హెయిర్ డ్రెస్సింగ్ సామగ్రి చోరీ

తెలుగు హీరో, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు కార్యాలయంలో చోరీ జరిగింది. దాదాపు ఐదు లక్షల రూపాయల విలువ చేసే సామాగ్రి మాయమైంది. ఈ చోరీకి విష్ణు హెయిర్ డ్రెస్సర్ నాగ శ్రీను చేసివుంటాడని అనుమానిస్తున్నారు. దీంతో మంచు విష్ణు మేనేజరు సంజయ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీ హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
ఇదిలావుంటే, చోరీ జరిగిన తర్వాత నాగ శ్రీను కనిపించకుండా పోయాడు. దీంతో ఆయనే ఈ చోరీ చేసివుంటాడని మేనేజర్ సంజయ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొనడంతో కేసు కేసు నమోదు చేసిన పోలీసులు హెయిర్ డ్రెస్సర్ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.