బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 26 ఫిబ్రవరి 2022 (11:42 IST)

మాదాపూర్‌లో భారీ చోరీ : వ్యాపారి ఇంట్లో రూ.50 లక్షలు చోరీ

హైదరాబాద్ నగరంలోని మాదాపూర్‌లో భారీ చోరీ జరిగింది. శనివారం వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, మాదాపూర్‌లోని కావూరి హిల్స్ ఫేజ్ 2లో వాసుదేవ రెడ్డి అనే వ్యాపారి నివసిస్తున్నారు. ఈయన గురువారం సాయంత్రం తన కుటుంబ సభ్యులతో కలిసి మెయినాబాద్ సమీపంలోని తన ఫామ్‌హౌజ్‌కు వెళ్లి రాత్రి 11 గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చారు. అయితే, ఇంటి తాళం విరగ్గొట్టి ఉండటం చూసిన హతాశులయ్యారు. 
 
ఆ తర్వాత ఇంట్లోకి వెళ్లి చూడగా కప్‌బోర్డులో ఉంచిన రూ.20 లక్షల నగదుతో పాటు కొంతమొత్తంలో అమెరికన్ డాలర్లు, రూ.30 లక్షల విలువైన బంగారు ఆభరణాలు దాచివుంచిన సేఫ్ లాకర్ మాయమైనట్టు గుర్తించారు. ఆ వెంటనే మాదాపూర్ పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.