మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 4 డిశెంబరు 2021 (16:51 IST)

వాట్సాప్ నుంచి అదిరిపోయే ఆఫర్.. రూపాయి పంపినా క్యాష్‌బ్యాక్

సోషల్ మీడియా అగ్రగామి అయన వాట్సాప్ ప్రస్తుతం పేమెంట్ సేవల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే.  ఆన్ లైన్ పేమెంట్ ఫ్లాట్‌ఫామ్‌లోకి వచ్చిన వాట్సాప్ ప్రస్తుతం అదిరిపోయే ఆఫర్‌ను ఇచ్చింది. వాట్సాప్ ద్వారా ట్రాన్‌స‌క్ష‌న్ చేసుకునే క‌స్ట‌మ‌ర్ల‌ను పెంచుకునే దిశగా.. క్యాష్ బ్యాక్ ఆఫ‌ర్‌ను అందిస్తున్న‌ట్టు తెలిపింది.  
 
ముఖ్యంగా కేవ‌లం ఒక్క‌రూపాయి పంపినా కూడా ఈ క్యాష్ బ్యాక్ ఆఫ‌ర్ అనేది వ‌ర్తిస్తుంద‌ని పేర్కొంది. కానీ వాట్సాప్ ద్వారా ఐదు ట్రాన్‌స‌క్ష‌న్ల వ‌ర‌కే ఈ ఆఫ‌ర్ వ‌ర్తిస్తుంద‌ని వాట్సాప్ స్పష్టం చేసింది. ఆ త‌రువాత చెల్లించే వాటికి మాత్రం ఈ ఆఫ‌ర్ వ‌ర్తించ‌దని వాట్సాప్ ఓ ప్రకటనలో వెల్లడించింది.
 
అలాగే ఈ ఆఫ‌ర్ వ‌ర్తించాలంటే 6 ఆండ్రాయిడ్ బీటా యూజ‌ర్లు అయి ఉండాలి. వాట్సాప్ ఆఫర్‌ను చూస్తుంటే.. గతంలో గూగుల్ పే, ఫోన్ పే, గుర్తుకు వ‌స్తున్నాయ‌ని ప‌లువురు పేర్కొంటున్నారు.