గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 24 ఆగస్టు 2022 (16:11 IST)

బ్ర‌హ్మాస్త్ర ప్రమోషన్.. చెన్నైలో ర‌ణ్ బీర్- నాగార్జున- రాజమౌళి

Brahmastra
Brahmastra
బ్ర‌హ్మాస్త్రలో ర‌ణ్ బీర్ క‌పూర్‌, అలియాభ‌ట్, అమితాబ్ బ‌చ్చ‌న్, అక్కినేని నాగార్జున, మౌనీరాయ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. పాన్ ఇండియా స్టోరీతో తెర‌కెక్కుతున్న ఈ మూవీ హిందీతోపాటు తెలుగు, త‌మిళం, బెంగాలీ, మ‌ల‌యాళ భాష‌ల్లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

తాజాగా బ్రహ్మాస్త్ర ప్రమోషన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయాన్ ముఖ‌ర్జీ డైరెక్ష‌న్‌లో మ‌ల్టీస్టార‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబ‌ర్ 9న విడుద‌ల కానుంది. తాజాగా బ్ర‌హ్మాస్త్ర త‌మిళ వెర్ష‌న్‌ను రాజ‌మౌళి విడుద‌ల చేశారు. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో బుధవారం చెన్నైలో జ‌క్క‌న్న అండ్ బ్ర‌హ్మాస్త్ర టీం ల్యాండ్ అయ్యింది. Brahmastra
Brahmastra


ఈవెంట్‌లో పాల్గొన్న రాజమౌళి ఆసక్తికర కామెంట్లు చేశారు. తనకు ఏదో ఒక రోజు సూప‌ర్ స్టార్ రజినీకాంత్‌ను డైరెక్ట్ చేయాల‌నుంద‌ని రాజమౌళి చెప్పారు. ప్రస్తుతం ఈ ఈవెంట్‌కి సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Brahmastra
Brahmastra