సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శనివారం, 20 నవంబరు 2021 (17:36 IST)

ఇది చెడ్డ సంప్రదాయం - కొత్త‌గా ఆంధ్ర ఏర్ప‌డ్డాకే వ‌చ్చింది - నాగ‌బాబు

Naga babu
`చంద్ర‌బాబు నాయుడు కొన్నేళ్ళ‌పాటు సి.ఎం.గా వున్నారు. ఆయ‌న ఫేస్‌లో ఎటువంటి భావాలు పైకి క‌నిపించ‌వు. లోప‌ల దాచుకుంటాడేమో. కానీ మొదటిసారి ఆయ‌న బాధ‌ప‌డ‌డం నిజంగా నాకు బాధ క‌లిగించింది. ఎవ‌రి కుటుంబానికి సంబంధించిన వ్య‌క్తుల్ని విమ‌ర్శిస్తే ఎంత బాధ వుంటుందో నాకు బాగా తెలుసు. నేను చంద్ర‌బాబును విమ‌ర్శించాను. కానీ క‌న్నీళ్ళు పెట్టేంత‌లా చేసే ప‌ద్ద‌తి చెడ్డ సంప్ర‌దాయం` అని మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు వ్యాఖ్యానించారు.
 
- శ‌నివారంనాడు ఆయ‌న త‌న స్వంత యూట్యూబ్ ద్వారా ఇలా వెల్ల‌డించారు. 
- నేను జ‌న‌సేన సైనికుడిని. ప‌వ‌న్ క‌ళ్యాణ్ నాయ‌క‌త్వంలో చేస్తున్న సైనికుడిగా మాట్లాడుతున్నా. బిజెపి అంటే అభిమానం వుంది. ఈ రెండు త‌ప్ప తెలుగుదేశం పార్టీ  కానీ వైసిపీ  నానీ త‌ప్పు చేస్తే పోరాటాలు చేస్తాం. పార్టీల‌ ప‌రంగా పాల‌న ప‌రంగా త‌ప్పులు వుంటే ఎత్తిచూపుతాం. ఇలా కుటుంబంలోని వారిని దూషించం.
 
- చంద్ర‌బాబు పాల‌లో నేను వెటకారంగా మాట్లాడాను. విమ‌ర్శించాను. అలాగే జ‌గ‌న్ పాల‌న‌నూ విమ‌ర్శించాను. అది కూడా ప‌ద్ద‌తిగానే వుంటుంది. కానీ నిన్న జ‌రిగిన శాస‌న‌మండ‌లి స‌భ్యుల తీరు దారి త‌ప్పింది. ఇది వైసీపీతోనే వ‌చ్చింద‌ని కాదు. కొత్త‌గా ఆంధ్ర ఏర్పడ్డాక మొద‌లైంది.
 
- గ‌తంలో కూడా టిడిపి వ్య‌క్తి చెప్ప‌కూడ‌ని ప‌ద‌జాలంతో వైసిపీ వారిని దూషించాడు. వ్య‌క్తిగ‌తంగా ఎటాక్ చేశారు. సి.ఎం. జ‌గ‌న్ కూడా ఓ మిటింగ్‌లో త‌న‌ను ఇలా అన్నార‌ని బాధ‌ప‌డ్డారు. ఆయ‌న‌కు అధికారులు వున్నారు కాబ‌ట్టి చ‌ర్య తీసుకోగ‌ల‌రు. అప్పుడు కూడా జ‌గ‌న్‌ను తిట్ట‌డం క‌రెక్ట్ కాద‌నిపించింది.
 
- ఇవాళ చంద్ర‌బాబునాయుడుగారి భార్య భ‌వ‌నేశ్వ‌రిని విమ‌ర్శించ‌డం స‌రికాదు. మీరు లోకేష్‌ను విమ‌ర్శించండి. చంద్ర‌బాబు పాల‌న‌లో అవినీతి ఎండ‌గ‌ట్టండి. కానీ కుటుంబ మ‌హిళ‌ల‌పై దూషించ‌డం చెడ్డ సంప్ర‌దాయం అని పేర్కొన్నారు.
- మా అన్న పార్టీ పెట్టినప్పుడు తిట్టారు. మేం బాధ‌ప‌డ్డాం. అదే బాధ‌ను ఇప్పుడు చంద్ర‌బాబు ప‌డుతుంటే క‌ల‌చివేసింది. ద‌య‌చేసి ఏ పార్టీలోనివారైనా ప్లీజ్‌.. వ్య‌క్తిగ‌తంగా, కుటుంబాల‌ను దూషించ‌కండి.