అల్లు అర్జున్ కొత్త సినిమా ఇదే!
Allu Arjun, Koratala mvie
అల్లు అర్జున్ `పుష్ప` చిత్రం షూటింగ్ దాదాపుగా ముగింపు దశకు చేరుకుంది. ఈ సినిమా తర్వాత ఆయన ఏ సినిమా చేస్తాడో అని అభిమానుల్లో చర్చ నెలకొంది. మరోవైపు ఆయన రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దర్శకుడు సుకుమార్ కూడా చాలా స్పీడ్‌గానే సినిమాను పూర్తి చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన పోస్ట్‌ప్రొడక్షన్ పనులు కూడా ఏకకాలంలో జరుగుతున్నాయి. ఈ సినిమాను ఆగస్ట్ 13న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు దర్శక నిర్మాతలు. దానికి తగ్గట్లుగానే షూటింగ్ పూర్తి చేస్తున్నాడు సుకుమార్.
పుష్ప తర్వాత వేణు శ్రీరామ్ సినిమా చేయాల్సివుంది. దానితోపాటు కొరటాల శివతో ఓ సినిమాకు కమిట్ మెంట్ ఇచ్చాడు అల్లు అర్జున్. అయితే సమాచారం ప్రకారం కొరటాల శివ సినిమానే ముందుగా సెట్‌పైకి వెళ్ళే సూచనలు కన్పిస్తున్నాయి. ఇందుకు సంబంధించి ప్రీప్రొడక్షన్ స్కెచ్ లు కూడా రెడీ అయ్యాయి. అదే ఇది. కొరటాల ప్రస్తుతం చిరంజీవి `ఆచార్య` సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా మే 13న విడుదల కానుంది. అనంతరం కొరటాల కొత్త ప్రాజెక్ట్ అల్లు అర్జున్‌తో చేయనున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాను త్వరగా పూర్తిచేయాలని కూడా అనుకుంటున్నారు. త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ సినిమాను కొరటాల శివ స్నేహితుడు సుధాకర్ మిక్కిలినేని నిర్మిస్తున్నాడు. పాన్ ఇండియన్ సినిమానే ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ సినిమాలు బాలీవుడ్లోనూ, మాలీవుడ్‌లోనే క్రేజ్‌తెచ్చుకున్నాయి.