శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 26 మార్చి 2024 (13:09 IST)

రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' - రేపు ఉదయం 9 గంటలకు "జరగండి.. జరగండి" సాంగ్ లోడింగ్

game changer
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - సెన్షేనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం గేమ్ ఛేంజర్. ఈ నెల 27వ తేదీ చెర్రీ పుట్టిన రోజును పురస్కరించుకుని చిత్రం అప్డేట్‌ను నిర్మాణ సంస్థ వెల్లడించింది. బుధవారం ఉదయం 9 గంటలకు ఈ చిత్రంలోని జరగండి.. జరగండి అనే పాటను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. చరణ్ పుట్టినరోజును పురస్కరించుకుని పాటను విడుదల చేయనున్నారు. 
 
పాటకు  సంబంధించి పోస్టర్‌‌ను విడుదల చేశారు. గేమ్ ఛేంజర్‌‍లో చరణ్ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ నటిస్తుంది. ఇతర ప్రధాన పాత్రలను అంజలి, శ్రీకాంత్, ఎస్.జే సూర్య, సముద్రఖని, నవీన్ చంద్ర తదితరులు పోషిస్తున్నారు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. నిజానికి ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ కోసం మెగా ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ నుంచి బిగ్ అనౌన్స్‌మెంట్ రావడంతో అభినానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ పాటకు సంబంధించిన పోస్టర్‌ను కూడా మేకర్స్ విడుదల చేశారు.