ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 28 ఏప్రియల్ 2019 (16:51 IST)

టాలీవుడ్‌లో విషాదం.. చంద్రబోస్ ఇకలేరు...

టాలీవుడ్‌లో విషాదం నెలకొంది. పలు చిత్రాలతో పాటు.. బుల్లితెర సీరియళ్ళలో నటించిన నటుడు సుభాష్ చంద్రబోస్ మృతి చెందారు. ఆయన ఇటీవల ప్రమాదవశాత్తుజారి కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించగా అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. 
 
ఈయన 'నిన్నే పెళ్లాడుతా', 'ఇడియట్', 'శివమణి', 'అల్లరి రాముడు' వంటి అనేక చిత్రాల్లో నటించారు. అలాగే పలు టీవీ సీరియళ్లలో నటించాడు. ఆయన నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ కృష్ణానగర్‌లోని తన నివాసంలో ప్రమాదవశాత్తు జారిపడ్డారు. దాంతో తలకు బలమైన గాయాలు తగిలాయి. బోస్ అప్పటి నుంచి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వచ్చారు. 
 
అయితే, తలకు తగిలిన దెబ్బలు తీవ్రమైనవి కావడంతో ప్రాణాలు విడిచారు. బోస్ మరణంతో సినీ, టీవీ రంగాల్లో విషాదం అలుముకుంది. ఆయనతో అనుబంధం ఉన్న నటీనటులు విచారం వ్యక్తం చేస్తున్నారు. సుభాష్ చంద్రబోస్ దాదాపు మూడు దశాబ్దాలుగా నట ప్రస్థానం కొనసాగిస్తున్నారు. సుమన్ హీరోగా వచ్చిన "సాహసపుత్రుడు" చిత్రంతో సినీ రంగానికి పరిచయం అయ్యారు.