గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 26 ఏప్రియల్ 2019 (16:59 IST)

'అన్నా నేనున్నాను.. ఏం చేయాలో చెప్పు'.. అంటూ అలీ రావాల్సింది...

వైకాపా నేత, హాస్య నటుడు అలీకి 'గబ్బర్ సింగ్' రౌడీ బ్యాచ్‌లో ఒకరైన గబ్బర్ సింగ్ సాయి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ద్వారా ఎన్నో అవకాశాలు పొంది ఎంతో లబ్దిపొందిన అలీ... ఇపుడు ఓ సెల్ఫ్ వీడియో విడుదల చేయడం సబబు కాదని సాయి వ్యాఖ్యానించారు.
 
'గబ్బర్ సింగ్' సాయి తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. దీనిపై ఆయన మాట్లాడుతూ, పవన్‌ను చాలా దగ్గరగా చూసినవాళ్ళలో మేమూ ఉన్నాం. ఆయనది ఎంత మంచి మనసో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే తనను ఎవరూ ఆహ్వానించకపోయినా స్వయంగా ముందుకు వచ్చి ప్రచారం చేసినట్టు వెల్లడించారు.
 
ఇకపోతే, పవన్‌కు అలీకి మధ్య చాలా దగ్గరి సాన్నిహిత్యం ఉండేదన్నారు. అలాంటి అలీని పార్టీలోకి పవన్ కళ్యాణ్ ఆహ్వానించనక్కర్లేదన్నారు. ఎందుకంటే.. అలీనే.. "అన్నా నేనున్నాను.. ఏం చేయాలో చెప్పు" అంటూ ముందుకు వచ్చివుండాల్సి ఉందన్నారు. 
 
పైగా, పవన్ కళ్యాణ్ ద్వారా అలీ ఎన్నో సినీ అవకాశాలు సంపాదించుకున్నారు. అలాంటి అలీ... పవన్‌కు కౌంటర్ ఇస్తూ వీడియో రిలీజ్ చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అలీ ఈ విధంగా చేయడం ఆయనకే నష్టం.. పవన్ కల్యాణ్‌కి జరిగే నష్టం ఏమీ లేదు. ఇండస్ట్రీలో ఇలాంటివాళ్లు ఎంతమంది సపోర్ట్ చేయకపోయినా పవన్ కల్యాణ్‌కి ఏమీ కాదన్నారు.