గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 1 అక్టోబరు 2018 (17:51 IST)

'లెక్చరర్‌'గా ఈషా రెబ్బ... పాఠాలు ఎలా బోధిస్తుందో...

టాలీవుడ్‌లోని కుర్ర హీరోయిన్లలో ఈషా రెబ్బా ఒకరు. 'దర్శకుడు' చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం ద్వారా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. ఆ తర్వాత 'అ' చిత్రంలోనూ కనిపించింది.

టాలీవుడ్‌లోని కుర్ర హీరోయిన్లలో ఈషా రెబ్బా ఒకరు. 'దర్శకుడు' చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం ద్వారా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. ఆ తర్వాత 'అ' చిత్రంలోనూ కనిపించింది.
 
ఇపుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న చిత్రం "అరవింద సమేత వీరరాఘవ". ఈ చిత్రంలోనూ కీలక పాత్రలో కనిపించనుంది. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈషా.. ఇపుడు శాండల్‌వుడ్ (కన్నడ చిత్ర పరిశ్రమ)లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు ఫిలింనగర్ వర్గాలు వెల్లడించాయి.
 
కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్ సినిమాలో ఈషా నటించే అవకాశం కొట్టేసింది. ఈ చిత్రంలో ఈషా రెబ్బా కాలేజీ లెక్చరర్ పాత్రలో కనిపించనుందట. ఈ సినిమాకు లక్కీ గోపాల్ దర్శకుడు. కిరిక్ పార్టీ (కన్నడ)కి మ్యూజిక్ అందించిన అజనీష్ బీ లోక్‌నాథ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించనున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.