శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 12 మే 2020 (11:55 IST)

'దిల్ రాజు' రెండో భార్య పేరు ఏంటో తెలుసా? (video)

టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు మరోమారు ఓ ఇంటివాడయ్యారు. ఆయన తన కుమార్తె హన్షిత ఎంపిక చేసిన ఓ వధువును రెండో పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహం ఆదివారం రాత్రి నిజామాబాద్ జిల్లాలోని నార్సింగపల్లిలో ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో నిరాడంబరంగా జరిగింది. ఈ వివాహానికి కేవలం ఇరు కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. 
 
అయితే, వధువు వివరాలను అత్యంత గోప్యంగా ఉంచిన దిల్ రాజు.. వివాహం తర్వాత పెళ్లి ఫోటోలతో పాటు.. వధువు వివరాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ ప్రకారంగా వధువు పేరు వైఘా రెడ్డి. కానీ, వివాహం కోసం ఆమె పేరును తేజశ్వినిగా మార్చు చేశారు. ఈమె బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన యువతి. అలాగే, ఈ వివాహం జరగడానికి కర్త, కర్మ, క్రియ పూర్తిగా దిల్ రాజు కుమార్తె హన్షితా రెడ్డి. 
 
కాగా, దిల్ రాజుకు ఇది రెండో వివాహం. ఆయన మొదటి భార్య అనిత గత 2017లో అనారోగ్య కారణంగా మృతి చెందారు. అప్పటి నుంచి ఆయన వివాహం చేసుకోలేదు. అయితే, కుమార్తె హన్షితా రెడ్డి ఒత్తిడి మేరకు రెండో వివాహానకి సమ్మతించిన దిల్ రాజు.. ఎట్టకేలకు మరోమారు ఓ ఇంటివాడయ్యారు.