సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 20 ఏప్రియల్ 2020 (17:35 IST)

'లాక్ డౌన్-పుట్టినింట్లో భార్య.. ప్రియురాలి మెడలో తాళి కట్టేసిన భర్త

లాక్ డౌన్ కారణంగా మహిళలపై గృహ హింసలు పెరిగిపోతున్నాయని అధ్యయనాలు తేల్చిన నేపథ్యంలో.. లాక్ డౌన్‌ను సాకుగా కొందరు మగాళ్లు పిచ్చి పనులు చేస్తున్నారు. ఇప్పటికే భార్యకు దూరంగా ఉండలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే.. మందు లేకుండా ఉండలేమని మరికొందరు నానా హంగామా చేసిన ఉదంతాలున్నాయి. 
 
తాజాగా ఓ ప్రబుద్ధుడు భార్య మెట్టినింటికి రాలేదని.. తన ప్రియురాలిని వివాహం చేసుకున్నాడు. ఈ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. లాక్‌డౌన్‌ కారణంగా మెట్టినింటికి చేరుకోలేని భార్యపై కోపంతో మరో పెండ్లి చేసుకున్నాడు సదరు బీహార్ వ్యక్తి.
 
వివరాల్లోకి వెళితే.. పాట్నా పాలీగంజ్‌కు చెందిన ధీరజ్ కుమార్‌కు దుల్హిన్ బజార్‌కు చెందిన యువతితో ఇటీవలె పెండ్లయింది. కొన్నిరోజుల కిందటే ఆమె పుట్టింటికి వెళ్లగా, ఆపై లాక్ డౌన్ ప్రకటించారు. దాంతో ఆ యువతి పుట్టింట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. 
 
అయితే ధీరజ్ కుమార్ అసహనానికి లోనై, భార్యను వెంటనే వచ్చేయాలని అనేకమార్లు ఫోన్ చేశాడు. రాకపోవడంతో మరింత అసంతృప్తికి గురైన ధీరజ్ మాజీ ప్రియురాలి మెళ్లో తాళికట్టేశాడు. దాంతో దిగ్భ్రాంతికి గురైన మొదటి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్తను అరెస్ట్ చేశారు.