గురువారం, 28 సెప్టెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

రాత్రివేళ కాఫీకి పిలవడంతో విషయం అర్థమైంది : క్యాస్టింగ్ కౌచ్‌పై నటుడు రవి కిషన్

ravikishan
చిత్రపరిశ్రమలో ఉన్న కాస్టింగ్ కౌచ్‌పై టాలీవుడ్ విలన్ నటుడు రవి కిషన్ తనకు ఎదురైన అనుభవాన్ని వివరించారు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని రవి కిషన్ వెల్లడించారు. ఇండస్ట్రీకి చెందిన ఓ మహిళ తనను కాఫీకి పిలిచిందని వెల్లడించారు. పైగా, ఆ మహిళ రాత్రివేళ కాఫీకి పిలవడంతో తనకు విషయం అర్థమైందని చెప్పారు. దాంతో ఆమెకు నో చెప్పానని వివరించారు. 
 
ఇటీవలికాలంలో కాస్టింగ్ కౌచ్‌పై పలువురు నటీనటులు తమకు ఎదురైన అనుభవాలను వివరిస్తున్నారు. తాజాగా రవి కిషన్ తనకు ఎదురైన అనుభవాన్ని బహిర్గతం చేశారు. తన కెరీర్ కొత్తల్లో ఇండస్ట్రీలో ఉన్న ఒక మహిళ తనను రాత్రివేళ కాఫీ తాగుదాం రమ్మని పిలిచిందని చెప్పారు. ఉదయం, మధ్యాహ్నం కాకుండా, రాత్రి సమయంలో కాఫీ అనే సరికి తనకు సందేహం వచ్చిందన్నారు. 
 
ఆ తర్వాత ఆమె మనసులో ఏముందో తాను గ్రహించి, నో చెప్పానని తెలిపారు. ప్రస్తుతం ఆమె చిత్రపరిశ్రమలో ఉన్న స్థానంలో ఉన్నారని, ఆమె పేరును బహిర్గతం చేయడం ఏమాత్రం సబబు కాదన్నారు. అదేసమయంలో యువత సినీ అవకాశాల కోసం తప్పుడు, వక్ర మార్గాల్లో వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. టాలెంట్ ఉంటే తప్పకుండా పైకి వస్తామన్నది తనకు నమ్మకం రవి కిషన్ తెలిపారు.