ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 3 ఫిబ్రవరి 2019 (10:22 IST)

క్లాసికల్ నృత్యంతో మెస్మరైజ్ చేసిన త్రివిక్రమ్ సతీమణి...

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేకంగా గుర్తింపు పొందిన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. మాటల మాంత్రికుడుగా పేరుగడించారు. ఈయన ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి సోదరుడు కుమార్తె సౌజన్యను వివాహం చేసుకున్నారు. నిజానికి ఆమె ఓ క్లాసికల డాన్సర్. పెళ్లికి ముందు అనేక నృత్య ప్రదర్శనలు కూడా ఇచ్చేవారు. పెళ్లి తర్వాత ఆమె పూర్తిగా ఇంటికే పరిమితమైపోయారు. 
 
అలాగే, త్రివిక్రమ్ కూడా ఎక్కడా తన కుటుంబ సభ్యులతో కలిసి పెద్దగా బయట కనిపించిన దాఖలాలు లేవు. ముఖ్యంగా, సినిమా ఈవెంట్స్‌కు కూడా వారిని పెద్దగా తీసుకునిరారు. ఒకవేళ తీసుకొచ్చినా... వారు సాధారణ ప్రేక్షకుల్లానే ఉండిపోతారు. 
 
అయితే, తాజాగా త్రివిక్రమ్ సతీమణి తన క్లాసికల్ నృత్యంతో మెస్మరైజ్ చేశారు. వైజాగ్‌లో జరిగిన కార్య‌క్ర‌మంలో అమె అదిరగొట్టేశారు. ఈ కార్య‌క్ర‌మానికి త్రివిక్ర‌మ్‌, సిరివెన్నెల కూడా హాజ‌రై సంద‌డి చేశారు. ఆమె నృత్యం చూపరుల‌ని విశేషంగా ఆక‌ట్టుకుంది. సౌజ‌న్య నృత్యానికి సంబంధించిన ఫోటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.