ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 2 జనవరి 2020 (16:16 IST)

భర్తకు మస్కా... సహచర వైద్య విద్యార్థితో లేచిపోయిన మహిళా వైద్యురాలు

అనంతపురం జిల్లాకు చెందిన ఓ మహిళా వైద్యురాలి అదృశ్యం కేసులోని చిక్కుముడి వీడింది. ఈ మహిళా వైద్యురాలు కట్టుకున్న భర్తను వదిలివేసి తన ప్రియుడుతో కలిసి పారిపోయినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన డాక్టర్ హిమబిందు, అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన దిలీప్ సత్యలు గత నెల 25వ తేదీన కనిపించకుండా పోయారు. దీనిపై హిమబిందు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో హిమబిందు, దిలీప్‌లు ప్రేమికులని తేలింది. వీరిద్దరూ సిక్కిం రాష్ట్రంలో ఉన్నట్టు ఆచూకీ లక్ష్యమైంది. వీరిని సోషల్‌ మీడియా సాయంతో పోలీసులు వెతికిపట్టుకున్నారు. అయితే, వీరిద్దరూ సిక్కింకు ఎందుకు వెళ్లారు.? అసలేం జరిగిందన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 
 
అసలు హిమబిందు ఓ విహహిత. ఈమె భర్త కూడా ఓ వైద్యుడే. పేరు డాక్టర్ శ్రీధర్. చర్చికి వెళ్లి వస్తానని భర్తకు చెప్పి ఇంటి నుంచి వెళ్లిన హిమబిందు ఆ తర్వాత ఇంటికి తిరిగిరాలేదు. నిజానికి తన భర్తను వదిలివేయాలని నిర్ణయించుకున్న హిమబిందు.. తన సహచర విద్యార్థి అయిన దిలీప్‌ సత్యతో కలిసి లేచిపోయినట్టు తెలుసుకున్న శ్రీధర్.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారిద్దరి ఫోన్లు స్విచాఫ్ చేసివున్నాయని పేర్కొన్నాడు. 
 
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, కేసును సీరియస్‌గా తీసుకున్నారు. చండీగఢ్‌‌లో పీడియాట్రిషియన్‌‌‌గా పనిచేస్తున్న దిలీప్, ఓ ఇంటర్వ్యూ నిమిత్తం వచ్చి, ఢిల్లీలోని శ్రీధర్, హిమబిందు దంపతుల ఇంట్లో దిగారు. వీరంతా గతంలో కర్నూలు మెడికల్ కాలేజిలో కలిసి చదువుకున్నారు. 25న క్రిస్మస్ సందర్భంగా చర్చికి వెళుతున్నానని భర్తకు ఫోనులో చెప్పిన హిమబిందు, ఆపై కనిపించకుండా పోయారు. దీంతో శ్రీధర్ వారి ఆచూకీ కనిపెట్టాలంటూ ఢిల్లీ పోలీసు కమిషనర్, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్లను అభ్యర్థించారు.
 
కాగా.. ఐదు రోజుల అదృశ్యంపై ఢిల్లీలో విచారణ జరుగుతోంది. వీరిద్దరూ సిక్కింకు ఎందుకు వెళ్లారు..? విహారయాత్రకు వెళ్లారా..? అసలేం జరిగింది..? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.