సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 25 డిశెంబరు 2019 (15:20 IST)

#పంత్‌కు స్పెషల్ కోచ్ కావాలి.. రిషబ్‌కు బ్యాకప్‌ వికెట్‌కీపర్‌గా వుంటాడు..

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఆస్ట్రేలియా వికెట్‌ కీపర్‌ అన్ని విధాలుగా ఉపయోగపడుతాడని ఆ జట్టు ప్రధాన కోచ్‌ రికీ పాంటింగ్‌ అన్నాడు. అలెక్స్‌ కారీ ఢిల్లీకి మ్యాచ్‌లు గెలిపించగలడని ఆశాభావం వ్యక్తం చేశాడు. రిషభ్‌ పంత్‌కు బ్యాకప్‌ వికెట్‌కీపర్‌గా కూడా ఉంటాడని రికీ వ్యాఖ్యానించాడు. 
 
అలెక్స్‌ కారీ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్‌బాష్‌ లీగ్‌ (బీబీఎల్)లో అడిలైడ్‌ స్ట్రైకర్స్‌ తరఫున ఆడుతున్నాడు. అడిలైడ్‌ బ్యాటింగ్ లైనప్ నాలుగో స్థానంలో కారీ బరిలోకి దిగుతున్నాడు. లీగ్‌లోని ఓ మ్యాచ్‌లో కారీ కేవలం 24 బంతుల్లో హాఫ్ సెంచరీ (55) చేశాడు. అదే మ్యాచ్‌కు పాంటింగ్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. 
 
ఐపీఎల్‌-13 సీజన్‌లో ఎక్కువ మ్యాచ్‌లు ఆడతాడని నమ్ముతున్నానని రికీ వ్యాఖ్యానించాడు. వికెట్‌ కీపర్‌ పంత్‌కు గాయమైతే కీపింగ్ కూడా చేస్తాడు. పంత్‌కు బ్యాకప్‌ వికెట్‌కీపర్‌గా ఉంటాడని పాంటింగ్ తెలిపాడు. కాగా ఈ నెల 19న జరిగిన ఐపీఎల్ వేలంలో అలెక్స్ క్యారీని ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాంచైజీ రూ. 2.4 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో కారీ 2020లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేస్తున్నాడు. క్యారీ కొనుగోలు విషయంలో పాంటింగ్‌ కీలక పాత్ర పోషించాడని తెలుస్తోంది.
 
మరోవైపు టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పింత్ వికెట్ కీపింగ్ లో మరింత మెరుగు పడాల్సిన అవసరం బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ అన్నాడు. శ్రీలంక, ఆస్ట్రేలియా సిరీస్ లకు భారత జట్లను ఎంపిక చేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడాడు. 
 
రిషబ్ పంత్ వికెట్ కీపింగ్‌లో మెరుగుపడాల్సిన అవసరం వుందని చెప్పుకొచ్చాడు. వెస్టిండీస్ వన్డే సిరీస్ లో బ్యాటింగ్ విషయంలో రిషబ్ పంత్ ఫరవా లేదనిపించాడు. కానీ వికెట్ కీపింగ్‌లో మాత్రం చిన్న చిన్న తప్పిదాలు చేశాడు. కానీ పంత్‌ను ఒత్తిడిలోకి నెట్టకూడదని వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు బ్రియాన్ లారా తెలిపాడు.