సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించిన ఉలగ నాయగన్ పద్మశ్రీ కమల్ హాసన్
Kamalhasan launch krishna vigraham
లెజెండరీ నటుడు, సూపర్‌స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఉలగ నాయగన్ పద్మశ్రీ కమల్ హాసన్ ఈరోజు ఉదయం విజయవాడలో ఘనంగా ఆవిష్కరించారు. భారతీయ సినిమాలో చెరగని ముద్ర వేసిన దిగ్గజ వ్యక్తికి ఇది గొప్ప నివాళి. సూపర్ స్టార్ కృష్ణ గారి పట్ల సాంస్కృతిక అభిమానాన్ని ప్రతిబింబిస్తూ ఉలగ నాయగన్ కమల్ హాసన్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఈ వేడుకకు ప్రతిష్టను జోడించింది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో దేవినేని అవినాష్ పాల్గొన్నారు.
ఈ ఆవిష్కరణ ఒక సినిమా లెజెండ్ వేడుకను మాత్రమే కాకుండా, సూపర్ స్టార్ కృష్ణ గారు చిత్ర పరిశ్రమపై వేసిన చెరగని ముద్రకు ప్రతీక. ఈ మహత్తర వేడుకని చూసేందుకు సూపర్ స్టార్ అభిమానులు, శ్రేయోభిలాషుల పెద్ద ఎత్తున పాల్గొని కృష్ణగారిపై తమ ప్రేమ, అభిమానాన్ని వ్యక్తం చేశారు.
ఎంటర్ టైన్ మెంట్ వరల్డ్ కు సూపర్‌స్టార్ కృష్ణ గారు చేసిన కృషికి ఈ విగ్రహం కలకాలం నిలువెత్తు నిదర్శనంగా, తరతరాల మధ్య వారధిగా నిలిస్తుంది. విజయవాడలో ఉదయం జరిగిన వేడుకలు సూపర్‌స్టార్ కృష్ణ గారి శాశ్వతమైన వారసత్వాన్ని పునరుద్ఘాటించాయి.