బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : ఆదివారం, 7 జనవరి 2018 (16:21 IST)

పవన్, త్రివిక్రమ్‌ క్షుద్రపూజలు చేశారు.. వీడియో రిలీజ్ చేస్తా: కత్తి మహేష్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలిసి క్షుద్రపూజలు చేశారని.. ఇందుకు సంబంధించిన వీడియో సాక్ష్యం కూడా తన వద్ద వుందని ఓ టీవీ లైవ్ ప్రోగ్రామ్‌లో సినీ విశ్లేషకుడు కత్తి మహే

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలిసి క్షుద్రపూజలు చేశారని.. ఇందుకు సంబంధించిన వీడియో సాక్ష్యం కూడా తన వద్ద వుందని ఓ టీవీ లైవ్ ప్రోగ్రామ్‌లో సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ అన్నాడు. పవన్ కల్యాణ్‌లోని మరో కోణాన్ని తాను కనుగొన్నానని.. అతనో హ హీరో అయితే ఏంటని కత్తి ప్రశ్నించాడు. 
 
మనమంతా బానిసబతుకులు బతుకుతూ సుఖంగా వున్నాం. కానీ పవన్, త్రివిక్రమ్ క్షుద్ర పూజలు చేయడానికి వాళ్ల కారణాలు వాళ్లకు ఉండొచ్చు. విజువల్స్ చూస్తే కొన్ని తాంత్రిక విధానాల్లో ఈ పూజలు జరిగాయి. ఆ పూజ చేసిన పూజారి పేరు నరసింహ. ఆ పూజలు ఎక్కడ చేశారో తనకు తెలియదని.. కానీ వీడియో మాత్రం తనవద్ద వుందని చెప్పుకొచ్చారు. 
 
పవన్, త్రివిక్రమ్ రెండు, మూడు సార్లు తాంత్రిక పూజలు చేసినట్టు తెలుసు. కాకపోతే, తనవద్ద ఒక వీడియో మాత్రమే ఉందన్నారు. తాంత్రిక పూజల్లో కూడా ఎలాంటి ముగ్గులు వేస్తారో కూడా తనకు తెలుసు. ఇందుకు సంబంధించిన వీడియోను సమయం వచ్చినప్పుడు బయటపెడతానని కత్తి మహేష్ హెచ్చరించాడు. ఇలాంటి వ్యక్తులను సమాజానికి మార్గదర్శకం ఎలా అవుతారని ప్రశ్నించాడు.