శనివారం, 9 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 25 ఆగస్టు 2021 (20:38 IST)

విదేశాల‌కు పోకుండా ఇక్క‌డ లొకేష‌న్స్‌నే వాడుకోండిః మంత్రి శ్రీనివాస్ గౌడ్

the killer prerelease
కార్తీక్ సాయి హీరోగా డాలీషా, నేహా దేశ్‌పాండే హీరోయిన్లుగా చిన్నా దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా కార్తీక్'స్  ది కిల్లర్. ఆవుల రాజు యాదవ్, సంకినేని వాసు దేవ రావు నిర్మిస్తున్నారు. మంగళవారం ప్రీ రిలీజ్వేడుక హైదరాబాద్ లో జ‌రిగింది. టూరిజం మంత్రి శ్రీనివాస్ గౌడ్, నిర్మాత బెక్కెం వేణుగోపాల్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, జయసుధ తనయుడు నీహాల్  తదితర ప్రముఖులు హాజరయ్యారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ట్రైలర్ విడుదల చేయగా, బిగ్ టికెట్ ని హీరో సోహెల్ విడుదల చేశారు.
 
మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, తెలంగాణ రాక ముందు సినిమా రంగం కేవలం కొన్ని కుటుంబాలకు మాత్రమే ఉండేది, వాళ్ళు తీసిందే సినిమాలు, కానీ తెలంగాణ వచ్చాకా టాలెంట్ ఉన్నవాళ్లు చాలా మంది సినిమా రంగంలోకి వస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సినిమా రంగానికి ఎంతో ప్రోత్సహం అందిస్తున్నారు. పరిశ్రమకు కొత్త టాలెంట్ రావాల్సిన అవసరం. కొత్త టాలెంట్ వస్తేనే పరిశ్రమ మనుగడ సాగుతుంది. అయితే సినిమాల్లో మంచి మెసేజ్ ఉండే సినిమాలు రావాలి.  కేవలం వినోదం కోసమే కాదు, అందరు అంటే ఫ్యామిలీ అందరు కలిసి చూసేలా మంచి సినిమాలు రావాలి. ఈ సినిమా విషయానికి వస్తే కార్తీక్ సాయి చేస్తున్న ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే షూటింగ్స్ కోసం దేశ దేశాలకు పోకుండా తెలంగాణలోనే మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి. కేవలం నామమాత్రపు ఫీజుతో మీకు కావలసిన అన్ని రకాల లొకేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి మంచి అవకాశాన్ని సినిమా వాళ్ళు వాడుకోవాలని కోరుకుంటున్నానని తెలిపారు.
 
Srinivasa goud and others
నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ, ఈ సినిమాతో నిర్మాతలుగా పరిచయం అవుతున్న రాజు అన్న మరిన్ని సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. సినిమా విషయంలో ఏ సపోర్ట్ కావాలన్నా నేను అందించేందుకు సిద్ధంగా ఉన్నాను, ఈ టీం అందరికి మరోసారి ఆల్ ది బెస్ట్ అన్నారు.  
 
మ్యూజిక్ డైరెక్టర్ చిన్న మాట్లాడుతూ, ఈ సినిమా గురించి సతీష్ ఫోన్ చేసి సార్ ఈ సినిమా మీరు చూడాలి అని అడిగారు. సైకో సినిమా ను పట్టుబట్టి నాకు చూపించారు, అంతే కాదు ఈ సినిమాకు మీరే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేయాలనీ పట్టుబట్టారు. సినిమా చూసాను. బాలయ్య సింహా తరువాత ఆ రేంజ్ ఉన్న సినిమా ఇది. ఈ సినిమా హీరో, డైరెక్టర్ కార్తీక్ చేయడం నిజంగా సూపర్. తప్పకుండా ఈ సినిమా మంచి విజయం అందుకోవాలి. కార్తీక్ కు తప్పకుండా మంచి ఫుచర్ ఉంటుంది అన్నారు.
 
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ తోట సతీష్ మాట్లాడుతూ, హీరో కార్తీక్ కెమెరా వెనక, కెమెరా ముందు ఇలా రెండు పాత్రలు అద్భుతంగా చేసారు. చిన్నఈ సినిమాకు అయన ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్అదిరిపాయింది. ఈ సినిమా వచ్చే నెల 3న విడుదల అవుతుంది తప్పకుండా మా ప్రయత్నాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను అన్నారు.
హీరో , దర్శకుడు కార్తీక్ సాయి ( చిన్నా ) మాట్లాడుతూ, కిల్లర్ అంటే ఎదో థ్రిల్లర్ అనుకోకండి. ఇది ఫ్యామిలీ అందరు కలిసి చూసే సినిమా. తప్పకుండా అందరు థియేటర్స్ కి వచ్చి చూడండి అన్నారు. ఇంకా రామ సత్యనారాయణ,  సి ఐ నరసింహ స్వామి, హీరోయిన్ డాలీషా, నిర్మాత వాసుదేవరావు, రాజు యాదవ్, సోహైల్, సురేష్ కొండేటి త‌దిత‌రులు మాట్లాడుతూ, సినిమా విజ‌య‌వంతం కావాల‌ని ఆకాంక్షించారు.