మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 13 ఏప్రియల్ 2021 (09:14 IST)

జాతిరత్నాలు కలెక్షన్లను మించని వకీల్ సాబ్.. ఓటీటీలో లేనేలేదు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో హిందీ సినిమా పింక్‌కు రీమేక్‌గా వచ్చిన వకీల్ సాబ్ ఈ నెల 9న విడుదలై బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే కలెక్షన్స్‌ను రాబడుతోంది. మూడు సంవత్సరాల తర్వాత పవన్ నటించిన ఈ సినిమాకు అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా కోవిడ్ సమయంలో కూడా ఈ రేంజ్‌లో వసూళ్లు అంటే మాటలు కాదు. అయితే వస్తున్న సమాచారం మేరకు ఈ సినిమా ఓ విషయంలో జాతిరత్నాలు కలెక్షన్స్‌ను మించ లేకుండా పోయిందని తెలుస్తోంది. 
 
ఫస్ట్ వీకెండ్‌లో సండే రోజున జాతి రత్నాలు 121 లొకేషన్స్‌లో లక్ష1.26 లక్షల డాలర్స్ వసూలు చేయగా.. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ 283 లొకెషన్స్‌లో 66 వేల డాలర్లకు పరిమితమైంది. కేవలం అమెరికాలోనే కాకుండా.. అటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో కూడా జాతి రత్నాలు మంచి వసూళ్లను రాబట్టింది. 
 
మొదటి వీకెండ్ పూర్తై సరికి జాతిరత్నాలు ప్రీమియర్స్‌తో కలుపుకుని ఏడు లక్షల డాలర్స్ వసూలు చేయగా.. వకీల్ సాబ్ మాత్రం ఆరు 6.50 లక్షల డాలర్స్‌ను వసూలు చేసింది. ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించగా.. నివేదా థామస్, అంజలి, అనన్య నాగల్ల ఇతర ముఖ్య పాత్రలో కనిపించారు. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించాడు. దిల్ రాజు, బోణీ కపూర్ నిర్మించారు.
 
ఇకపోతే.. థియేటర్లలో విజయవంతంగా రన్‌ అవుతోన్న ఈ చిత్రాన్ని రెండు వారాల్లోనే ఓటీటీలో విడుదల చేయబోతున్నారంటూ.. సోమవారం ఓ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. అయితే ఈ వార్తలను నిర్మాతలు ఖండించారు. ఏప్రిల్‌ 23న ఈ చిత్రం డిజిటల్‌ మాధ్యమంలో విడుదలవుతుందనే వార్తలను ఎవరూ నమ్మవద్దని తెలుపుతూ.. అధికారికంగా ఓ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. 
 
ఓటీటీ విషయమై ఎటువంటి అగ్రిమెంట్‌ చేసుకోలేదని, దయచేసి వస్తున్న వార్తలను ఎవరూ నమ్మవద్దని, అందరూ బిగ్‌ స్క్రీన్‌పైనే ఈ చిత్రాన్ని చూడండని.. మేకర్స్‌ ఓ ప్రకటనను విడుదల చేశారు. ఓటీటీలో వస్తుంది కదా.. థియేటర్‌కి ఎందుకులే.. అని ప్రేక్షకుల్ని సైడ్‌ ట్రాక్‌లోకి తీసుకెళ్లాలని కొందరు అత్యుత్సాహం ప్రదర్శించినా.. వెంటనే మేకర్స్‌ రియాక్ట్ అయి.. రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చేశారు.