ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 28 నవంబరు 2020 (19:47 IST)

ఎఫ్-3 కోసం వరుణ్ అంత అడిగాడా? షాక్‌లో దిల్ రాజు?

టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి బ్లాక్ బ్లాస్టర్ హిట్ చిత్రం ఎఫ్‌2 కు సీక్వెల్ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఎఫ్-3 మూవీపై మొదటి నుంచి ఏదో ఒక వార్త లైమ్ లైట్‌లోకి వస్తూనే ఉంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన షాకింగ్ న్యూస్ ఒకటి ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది.
 
ఎఫ్-3లో తనకంటే వెంకటేశ్ రోల్‌కు ఎక్కువ ప్రాముఖ్యత ఉండటంతో.. వరుణ్ తేజ్ ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం కావడం లేదని టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో అనిల్ రావిపూడి వరుణ్ తేజ్ కోసం మరికొన్ని సీన్లు కూడా యాడ్ చేశాడట. తాజాగా మరో క్రేజీ గాసిప్ టాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
 
వరుణ్ తేజ్ ఎఫ్3 కోసం రూ.12 కోట్లు రెమ్యునరేషన్ ఇవ్వాలని అడుగగా.. నిర్మాత దిల్ రాజు ఈ వరుణ్ డిమాండ్‌తో డైలామాలో పడినట్టు టాక్. వరుణ్ తేజ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో మరి అనిల్ రావిపూడి అనుకున్న సమయానికి ఎఫ్3ను సెట్స్‌పైకి తీసుకెళ్దాడా...? లేదా చూడాలి.