గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 25 డిశెంబరు 2022 (10:06 IST)

టాలీవుడ్‌లో మరో గొప్ప నటుడు కన్నుమూత

chalapathi rao
తెలుగు చిత్రపరిశ్రమలో మరో విషాదకర ఘటన జరిగింది. కేవలం రెండు రోజుల్లో మరో కీలక నటుడు మృతి చెందారు. ఆయన పేరు చలపతి రావు. ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. గుండెపోటుతో మృతి చెందారు. 
 
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన నటనకు కూడా దూరంగా ఉన్నారు. ఆయన వయస్సు 78 సంవత్సరాలు. దాదాపు 1200కు పైగా చిత్రాల్లో నటించారు. 
 
కృష్ణా జిల్లా బల్లిపర్రు అనే గ్రామంలో గత 1944లో జన్మించిన చలపతిరావుకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన మృతివార్తతో టాలీవుడ్ చిత్రపరిశ్రమ షాక్‌కు గురైంది. 
 
గొప్ప నటుడు కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు ముగిసి 24 గంటలు కూడా పూర్తికాకముందే ఆయన చనిపోయారు. చలపతి రావు మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతున్నారు.