శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 1 నవంబరు 2021 (21:44 IST)

మూడ్ బాగోలేకపోతే.. బెడ్రూమ్‌లో అలా చేస్తాను..

విడాకులకు తర్వాత ఆధ్యాత్మిక టూర్లు చుట్టేస్తున్న సమంత.. పనిలో పనిగా తన బెడ్రూం పరిస్థితి ఎలా ఉంటుందో కూడా వివరిస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఒక కంపెనీ గురించి ప్రమోషన్ చేస్తూ.. చిందరవందరగా ఉన్న తన బెడ్ రూమ్‌ని చూపిస్తూ వీడియో ఒకటి షేర్ చేసింది సమంత.
 
సమంత షేర్ చేసిన ఈ వీడియోలో.. తన డ్రెస్సెస్, షూస్, కాస్మొటిక్స్.. ఇలా అన్ని చూపిస్తూ తన బెడ్ పై చిందరవందరగా పడున్న బట్టలను కూడా చూపిస్తుంది. సామ్ మాట్లాడుతూ.. తనకెప్పుడు మూడ్ బాగాలేకున్నా.. ఏ మాత్రం డిప్రెషన్ అనిపించినా.. తన్ బెడ్ రూమ్ సర్దుకుంటానని.. బెడ్ పై ఉన్న బట్టలని కబోర్డ్స్‌లో పెడుతూ టైం పాస్ చేస్తానని చెప్పింది సమంత. 
 
ఇక అలాగే సామ్ తన బెడ్రూంను సైతం చూపించింది. అక్కడ బెడ్ పై తన బట్టలన్ని కుప్పలు కుప్పలుగా పడేసి ఉన్నాయి. అక్కడే తన స్నేహితులతో సామ్ కూర్చుని కబుర్లు చెబుతూ కనిపించింది. కొన్నిసార్లు సర్దడం. కలపడం కంటే వదిలేయడం బెటర్ అంటూ చెప్పుకొచ్చింది సామ్.