శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ప్రీతి చిచ్చిలి
Last Updated : గురువారం, 21 మార్చి 2019 (10:59 IST)

పోలీసులకు క్షమాపణ చెప్పిన రౌడీ కామ్రేడ్ విజయ్ దేవరకొండ

అర్జున్ రెడ్డితో సంచలన నటుడిగా యువతలో క్రేజ్ తెచ్చుకున్నారు విజయ్ దేవరకొండ. ఆ తర్వాత రౌడీ బ్రాండ్ నేమ్‌తో పాపులర్ అయ్యారు. నోటా సినిమాలో కూడా రౌడీ సీఎం అంటూ హల్‌చల్ చేయడంతో పాటుగా బయట అటెండ్ అయ్యే ఈవెంట్‌లలో కూడా తన అభిమానులను రౌడీ గాళ్స్ అండ్ రౌడీ బాయ్స్ అంటూ పిలుస్తుంటారు. దీంతో  ఆ పేరు యువత మనస్సులో బాగా ముద్రపడిపోయింది.


ఈ అభిమానంతో తమ వెహికల్ నంబర్ ప్లేట్‌లపై నిబంధనలకు విరుద్ధంగా రౌడీ అని రాసుకుని తిరుగుతున్నారు యువత. తాజాగా నంబర్ ప్లేట్‌లపై విజయ్ దేవరకొండ రౌడీ బ్రాండ్ పేరు రాసుకుని తిరుగుతున్నందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేయగా, ఈ విషయంపై విజయ్ స్పందించి అభిమానులకు లేఖ రాసారు.
 
అభిమానులు నిబంధనలు ఉల్లంఘించినందుకు వారి తరఫున తాను క్షమాపణలు చెబుతున్నట్లు విజయ్ తెలిపారు. ఇక ఇలాంటి సంఘటనలు మళ్లీ రిపీట్ కాకుండా చూసుకుంటానని పోలీసువారికి రిప్లై ఇచ్చాడు. ప్రియమైన అభిమానులకు, నా రౌడీ పేరు కనిపించగానే, వారందరూ నా ఫ్యామిలీగా అనిపిస్తారు.

అందుకే నా కుటుంబసభ్యులు ఎవరూ చిక్కులలో పడకూడదని నేను అనుకుంటున్నాను. కొన్ని నిబంధనలు మనం తప్పకుండా పాటించాలి, అవి మన మంచి కోసమే. నేను కూడా వాటిని ఫాలో అవుతాను. మీ ఫ్యామిలీ/ స్నేహితులు/దేవుడు ఎవరిమీద ఉన్న ప్రేమ అయినా బైక్‌లో మిగతా భాగాల్లో చూపించండి, నంబర్ ప్లేట్‌ను మాత్రం నంబర్‌లకే వదలిలేయండని సలహా ఇచ్చారు.