శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 14 జులై 2021 (19:18 IST)

కియారాతో క‌నెక్ట్ అవుతున్న విజ‌య్‌ దేవ‌ర‌కొండ‌, గోవా బీచ్‌లో మునిగితేలుతున్నారట

Kiara-vijay
విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ఎవ‌రు న‌టించినా హీరోయిన్లు బాగా క‌నెక్ట్ అవుతార‌ట‌. ఇప్ప‌టి త‌రానికి చెందిన చాలామంది హీరోయిన్లు త‌మ ఫేవ‌రేట్ మూవీ `అర్జున్ రెడ్డి` అని చెబుతుంటారు. విజ‌య్‌తో న‌టించాల‌నుంద‌ని కూడా అంటుంటారు. ఈ రౌడీ స్ట‌యిల్‌కు, యాట్‌ట్యూడ్‌కు అంద‌రూ ఫిదా అవుతున్నారు. కార‌ణం అత‌ను ప్ర‌వ‌ర్తించే విధాన‌మే. ఉన్న‌ది ఉన్న‌ట్లు మాట్లాడేట‌ట్లుగా ఆయ‌న సినిమాలోని పాత్ర‌లు వుంటాయి. అలా ఎంతో మందిని ఫాలోవ‌ర్స్‌గా చేసుకున్నాడు. ఇప్పటికే సారా అలీఖాన్‌, శ్రద్ధా, జాన్వీకపూర్‌లు విజయ్‌ తమ ఫేవరెట్‌ హీరో అని చెప్పారు.
 
బాలీవుడ్ వెళ్ళిన విజ‌య్, పూరీతో `లైగ‌ర్` సినిమా చేస్తున్నాడు. అక్క‌డ షూటింగ్‌లో వుండ‌గానే ఆయ‌న‌కు యాడ్స్ కూడా ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. అందుకే రెండింటికి స‌రిపోయేలా ప్లాన్ చేసుకుంటున్న‌ట్లు తెలిసింది. ఈసారి ఎక్కువ‌గా కియారా అద్వానీతో క‌లిసి న‌టిస్తున్నాడు. ఓ రెస్టారెంట్‌లో భోజ‌నాలు ఫ్యామిలీతో చేసే సీన్‌లో విజ‌య్ ద‌గ్గ‌ర‌గా వ‌చ్చిన కియారా `క‌లిసి తింటే ప్రేమ పెరుగుతుంది` అంటూ డైలాగ్ చెబుతుంది. అదేవిధంగా సాయిప‌ల్ల‌వితోకూడా ఓ యాడ్ చేశాడు. కానీ ఆమెకంటే కియారా యాడ్‌కే పేరు వ‌చ్చింది. దానికితోడు

ఇటీవ‌లే గోవా బీచ్‌లో కియారా, విజ‌య్ ఇద్ద‌రూ క‌లిసి వున్న స్టిల్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. నెటిజ‌న్లు చాలామంది ఇద్ద‌రి మ‌ధ్య ఏదో వుంద‌ని కామెంట్లు చేశారు. త‌ల‌ వ‌ర‌కే క‌న‌బ‌డేలా వున్న ఆ స్టిల్స్ కియారా బికినీతో వుంద‌నీ, ఇద్ద‌రి మ‌ధ్య మంచి రాపో వుంద‌నీ, ప్రేమ‌లో వున్నారేమో అని కామెంట్లు తెగ చేసేశారు. ఈ జంట‌కు మంచి లైక్స్ కూడా వ‌చ్చాయి. మ‌రి దేనికోసం గోవాలో బీచ్‌కి వెళ్ళారో తెల‌ప‌లేదు కాబ‌ట్టి. నెటిజ‌న్లు ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఇస్తున్నారు.