డిఫరెంట్ థ్రిల్లర్ గా పచ్చీస్: హీరో రామ్స్
టాలీవుడ్ సెలబ్రిటీ డిజైనర్ రామ్స్ హీరోగా పరిచయం అవుతున్న తొలి చిత్రం పచ్చీస్. ఈ క్రైమ్ థ్రిల్లర్‌కు శ్రీకృష్ణ, రామసాయిలు సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో శ్వేతా వర్మ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అవస చిత్రం, రాస్తా ఫిల్మ్ బ్యానర్స్ పతా కాలపై కత్తూరి కౌశిక్ కుమార్, రామ సాయి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పచ్చీస్ సినిమా ఈ నెల 12 నుంచి ఆమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది ఈ సందర్భంగా హీరో రామ్స్ చెప్పిన విశేషాలు.
నాది భీమవరం నుంచి వచ్చాను. భీమవరంలో స్టైల్, స్టైలిష్ లుక్స్ అంటే చాలామందికి తెలియదు. కానీ సినిమాపై ఒక ప్యాషన్‌తో వచ్చి ఇక్కడ ముందు కాస్ట్యూమ్ డిజైనర్‌గా చేరాను. నాగార్జున, విజయ్‌దేవరకొండ , రామ్ పోతినేని, అడివి శేషు, రానా ఇలా చాలామంది పెద్ద హీరోలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా వర్క్ చేశాను. ఇక కాస్ట్యూమ్ డిజైనర్‌గా నేను ఇండస్ట్రీలో ఇంతమంది హీరోలకు వర్క్ చేయడానికి సినిమాకు పట్ల నాకు ఉన్న తపనే కారణం. ఇండస్ట్రీకి నేను హీరో అవుదామనే వచ్చాను. కానీ ముందుగా ఇండస్ట్రీలో ఒక చోటు కావాలి కాబట్టి కాస్ట్యూమ్ డిజైనర్‌గా వచ్చాను. ఇందులో సక్సెస్ అయ్యాను. టాలీవుడ్‌లో ఉన్న 75 శాతం మంది హీరోలకు నేను కాస్ట్యూమ్ డిజైనింగ్ చేశాను.
ఒక మంచి కథ కుదిరితే ఎప్పట్నుంచో సినిమా చేద్దామని అనుకుంటున్నాను. అలాంటి సమయంలో దర్శకులు సాయికృష్ణ, రామసాయిలు చెప్పిన థ్రిల్లింగ్ కథ నాకు బాగా నచ్చింది. ఇండస్ట్రీలోకి వచ్చే కొత్తవారిలో ఒకరకమైన ఫైర్ ఉంటుంది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో నాలోనూ అలాంటి ఫైరే ఉండేది. అందుకే కొత్తవారికి అవకాశం ఇచ్చేందుకు ఈ పచ్చీస్ సినిమాకు ఒకే చెప్పాను. పచ్చీస్ చిత్రయూనిట్లో దాదాపు అందరు కొత్తవారే. డిఫరెంట్ థ్రిల్లర్. ఈ సినిమా కథ, కథనాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తాయి. రెగ్యులర్ సినిమాకు భిన్నంగా ఉండే మా పచ్చీస్ సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను.
రానా, నాగార్జున, అడివిశేష్ వంటివారు మా సినిమాకు సపోర్ట్ చేయడం వల్ల మా సినిమాకు మరింత రీచ్ పెరిగింది. వీరి ప్రోత్సాహం లేకపోతే మా సినిమాకు ఇంత రీచ్ వచ్చేది కాదు. ట్రైలర్ చూసిన వారందరు బాగుందని చెబుతున్నారు. విజువల్స్, మ్యూజిక్ బాగున్నాయని అభినందిస్తున్నారు.
నెక్ట్స్ రెండు సినిమాలకు సైన్ చేశాను. ఇవి కూడా భిన్నమైన సినిమాలే. అలాగని రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేయనని కాదు. ముందుగా నన్ను నేను ఒక మంచి నటుడిగా నిరూపించు కోవాలనుకుంటున్నాను. ప్రేక్షకులు మెప్పు కోరుకుంటున్నాను. హిట్టు, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా నా సినిమా జర్నీని కొనసాగిద్దామని అనుకుంటున్నాను.
సాధారణంగా సినిమాల్లోకి వెళ్తానంటే కొందరి కుటుంబసభ్యలు ముందు వద్దని చెబుతుంటారు. కానీ నా ఫ్యామిలీ నుంచి నాకు మంచి ప్రోత్సాహం లభిస్తుంది. వారి సపోర్ట్‌తో నేను మరింత కష్టపడుతున్నాను.
మా పచ్చీస్ సినిమాను థియేటర్స్‌లోనే విడుదల చేద్దామని అనుకున్నాం. కాకపోతే ప్రస్తుత పరిస్థితుల్లో ఓటీటీకి వెళుతున్నాం. మా సినిమాలోని అందరు కొత్తవారే. ఈ సినిమాతో వారందరికీ మంచి చాన్సులు రావాలని కోరకుంటున్నాను. పచ్చీస్ సినిమా బాగా రావడానకి సహకరించిన చిత్రబృందం అందరికీధన్యవాదాలు.