మంగళవారం, 3 అక్టోబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 28 మార్చి 2023 (20:14 IST)

లండన్‌లో శోభితాతో డిన్నర్ చేసిన చైతూ.. ఫోటో వైరల్

Naga Chaitanya
Naga Chaitanya
అక్కినేని హీరో నాగచైతన్య ప్రస్తుతం లండన్‌లో వుండటం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. లండన్‌లో చైతూ దిగిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. శోభిత ధూళిపాళ్లతో చైతూ ప్రేమలో వున్నాడని పుకార్లు వచ్చిన సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో ప్రస్తుతం వారిద్దరి డిన్నర్ డేట్‌కి సంబంధించిన ఫోటో ఒకటి ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తోంది. ఈ ఫోటోలో చైతూ ఒక రెస్టారెంట్‌లో చెఫ్ సురేందర్ మోహన్‌తో కలిసి ఫోటోకు ఫోజిచ్చాడు. ఇక శోభిత బ్యాక్‌గ్రౌండ్‌లో టేబుల్ వద్ద కూర్చుంది. 
 
తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో చిత్రాన్ని పంచుకున్నారు. పోస్ట్‌లో హోటల్‌ను జియోట్యాగ్ చేయడంతో ఈ చిత్రం లండన్‌కు చెందినదని తేలింది. ఈ పోస్టుపై ప్రస్తుతం నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. నాగ చైతన్య 2017లో సమంత రూత్ ప్రభుని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అక్టోబర్ 2021లో విడాకులు తీసుకున్నాడు.