"ఇప్పుడిక మేము ముగ్గురం... జనవరి 2021లో రాబోతున్నారు" .. ఎలా కోహ్లీ!!

anushka - kohli
ఠాగూర్| Last Updated: గురువారం, 27 ఆగస్టు 2020 (11:56 IST)
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ శుభవార్త చెప్పాడు. త్వరలోనే ఇప్పుడిక మేము ముగ్గురం.. జనవరి 2021లో రాబోతున్నాం అంటూ ఓ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ట్వీట్ అర్థం.. తన భార్య అనుష్క గర్భందాల్చిందని, ఈమె 2021లో ఓ బిడ్డకు జన్మనిస్తుందని వెల్లడించారు.

కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న విరాట్ కోహ్లీ.. బాలీవుడ్ నటి అనుష్కశర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం దేశంలో ఉన్న టాప్ మోస్ట్ సెలెబ్రిటీ కపుల్స్‌లలో ఈ జంట ఒకటి. ఈ జంట జనవరిలో తమ ఇంటికి మూడో మనిషిని ఆహ్వానించనుంది.

ఈ విషయాన్ని విరాట్ స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడిస్తూ, అభిమానులకు శుభవార్త చెప్పారు. "ఇప్పుడిక మేము ముగ్గురం... జనవరి 2021లో రాబోతున్నారు" అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు అనుష్కతో ఉన్న ఫోటోను విరాట్ జతచేశారు.

ఇందులో అనుష్క బేబీ బంప్ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ట్వీట్ క్షణాల్లో వైరల్ అయింది. వేలాది లైక్స్ వచ్చాయి. ఎంతో మంది ఫ్యాన్స్, సెలబ్రిటీలు విరుష్క దంపతులకు శుభాభినందనలు చెబుతున్నారు. జనవరిలో డెలివరీ ఉన్నదంటే, ఇప్పుడు ఐదో నెల జరుగుతున్నట్టని, ముందే ఎందుకు చెప్పలేదని ఆప్యాయంగా ప్రశ్నిస్తూ, బిడ్డ ఎమోజీలతో హోరెత్తిస్తున్నారు.

దీనిపై మరింత చదవండి :