మంగళవారం, 26 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : మంగళవారం, 20 ఏప్రియల్ 2021 (20:15 IST)

అన్ని జాగ్రత్తలతో సినిమా చూడండి

"శుక్ర" సినిమా 'వోట్ ఆఫ్ థాంక్స్ మీట్‌లో చిత్ర యూనిట్‌

Sukra meet
యాక్షన్ థ్రిల్లర్ చిత్రాల్లో అరుదైన జానర్ గా చెప్పుకునే మైండ్ గేమ్ నేపథ్యంతో తెరకెక్కిన సినిమా "శుక్ర". ఈ చిత్రంలో అరవింద్ కృష్ణ, శ్రీజితా ఘోష్ జంటగా నటించారు. ఆద్యంతం ఆకట్టుకునే కథా కథనాలతో నూతన దర్శకుడు సుకు పూర్వజ్ ఈ చిత్రాన్ని రూపొందించారు. రుజాల ఎంటర్ టైన్ మెంట్స్, వైజాగ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. అయ్యన్న నాయుడు నల్ల, తేజ పల్లె నిర్మాతలు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న శుక్ర సినిమా ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా "వోట్ ఆఫ్ థాంక్స్ మీట్" ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా హీరో అరవింద్ కృష్ణ మాట్లాడుతూ, ఇక్కడికి వచ్చే వరకు బయట జరిగే కొన్ని న్యూస్ లు తెలియలేదు. ఇప్పుడు వార్తలు అందుతున్నాయి థియేటర్స్ మూసివేస్తున్నారు. కఠినమైన నిబంధనలు పెడుతున్నారు అని. అలాంటివి విన్నాక నాలో ఉత్సాహం తగ్గిపోయింది. కానీ ఎట్లాగైనా సినిమాను రిలీజ్ చేస్తాం అని మా నిర్మాతలు , దర్శకుడు చెబుతుంటే సంతోషంగా ఉంది. నేను టీమ్ పవర్ ను నమ్ముతాను. గత రెండేళ్లుగా మా టీమ్ అంతా ఎన్నో అడ్డంకులు అధిగమించి సినిమాను రిలీజ్ దాకా తీసుకొచ్చింది. అదే టీమ్ పవర్ సినిమాను ప్రేక్షకుల దగ్గరకు కూడా చేరుస్తుందని నమ్ముతున్నాను. ఇప్పుడున్న పరిస్థితుల ముందు మేము, మా టీమ్, సినిమా, సినిమా ఇండస్ట్రీ చిన్నది. పరిస్థితులు ఎలా ఉన్నా శుక్ర చిత్రాన్ని ఈనెల 23న విడుదల చేస్తున్నాం. మీకు మా సినిమా పాటలు, ట్రైలర్, విజువల్స్ నచ్చితే థియేటర్లకు రండి. మాస్క్, శానిటైజ్, సోషల్ డిస్టెన్స్ లాంటి అన్ని జాగ్రత్తలతో సినిమా చూడండి. అన్నారు.
 
సురేష్ మాట్లాడుతూ...మా బ్రదర్ తేజ్ కు బెస్ట్ విశెస్ చెబుతున్నాను. తను ఇలాంటి మూవీస్ ఇంకా చేయాలని కోరుకుంటున్నాను. ఫ్యూచర్ లో తనకు నా సపోర్ట్ తప్పకుండా ఉంటుంది. శుక్ర మూవీ టీమ్ కు అడ్వాన్స్ కంగ్రాట్స్ అన్నారు.
 
అమోజాన్ రాజీవ్ మాట్లాడుతూ...శుక్ర సినిమా చూశాను. మన సినిమా స్టాండర్డ్ కు మించి ఉంది. ఒక ఇంటర్నేషనల్ సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది. మ్యూజిక్ చాలా బాగుంది. శుక్ర అంటే క్లీన్ అండ్ క్లియర్ అని అర్థం. సినిమా కూడా అలాగే ఉంటుంది.  ఏప్రిల్ 23న శుక్ర సినిమాను సేఫ్ గా థియేటర్లో చూడండి. అన్నారు.
 
రావణలంక హీరో క్రిష్ మాట్లాడుతూ...శుక్ర మూవీ ఎంటైర్ టీమ్ కు కంగ్రాట్స్. ఈ సినిమా ప్రొడ్యూసర్ తేజ్ నాకు క్లోజ్ ఫ్రెండ్. ఇందాక మేము ఇక్కడికి వస్తుంటే తేజ్ కు పదీ పదిహేను కాల్స్ వచ్చాయి. ఇవన్నీ వేర్వేరు రాష్ట్రాల నుంచి వచ్చిన కాల్స్. మా రాష్ట్రంలో మేము రిలీజ్ చేసుకుంటాం అని వాళ్లు అడుగుతున్నారు. ఇలాంటి టఫ్ టైమ్ లో సినిమాను రిలీజ్ చేయడానికి దమ్ము కావాలి. ఆ ధైర్యం మా తేజ్ లో ఉన్నాయి. సినిమా చూశాను. ఇచ్చిన బడ్జెట్ కంటే రెట్టింపు ఔట్ పుట్ ఇచ్చారు దర్శకుడు. అరవింద్ బాడీ లాంగ్వేజ్, నటన చాలా బాగుంది. హీరోయిన్ గ్లామర్ గా ఉంది. ఎంటైర్ టీమ్ చాలా కష్టపడి, నాది సినిమా అని చేసినట్లు ఉంది. అన్నారు. 
 
నిర్మాత తేజ్ పల్లె మాట్లాడుతూ...శుక్ర సినిమా కోసం పనిచేసిన చాలా మంది టెక్నీషియన్స్ ఇప్పుడు ఇక్కడ లేరు. వాళ్లందరికీ థాంక్స్ చెబుతున్నాను. వాళ్ల వర్క్ వల్లే మా సినిమా పాటలు, కంటెంట్ కు ఇంత మంచి పేరు వచ్చింది. మాకున్న బడ్జెట్ కు ఇలాంటి క్వాలిటీ ఫిల్మ్ వచ్చిందంటే అది సినిమాటోగ్రాఫర్ జగదీశ్ గారి టాలెంట్ అని చెప్పొచ్చు. సుకు పూర్వజ్ కు ఉన్న పట్టుదలకు, క్రియేటివిటీకి మంచి కమర్షియల్ డైరెక్టర్ అవుతాడు. అప్పుడే మా ప్రయత్నానికి సంతోషపడతాం. హీరో అరవింద్ కృష్ణ మాకు దొరకడం మా అదృష్టం. అంతగా అడ్జెస్ట్ అయి సినిమా చేశాడు. వన్ మ్యాన్ షో లాగా సినిమా చేశాడు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మా సినిమా చూడాలని ప్రేక్షకులను కోరుకుంటున్నా. అన్నారు.
 
దర్శకుడు సుకు పూర్వజ్ మాట్లాడుతూ...ప్రి రిలీజ్ గ్రాండ్ గా చేద్దామనుకున్నాం. చాలా మంది గెస్ట్ లను పిలుద్దాం అని ప్లాన్ చేశాం. అయితే ఇప్పుడున్నన టైమ్ ఎలా ఉందో మీరు ఊహించుకోవచ్చు. అందుకే వోట్ ఆఫ్ థాంక్స్ పేరుతో ప్రీమియర్ షోలకు, ట్రైలర్, పాటలకు మీరు ఇచ్చిన రెస్పాన్స్ కు థాంక్స్ చెప్పుకుంటున్నాం. పోయిన జన్మలో ఎక్కడో నేను సినిమా సినిమా అనుకుంటూ మధ్యలో జర్నీ ఆపేసినట్లు ఉన్నాను. అందుకే ఈ జన్మలో మూడో క్లాస్ నుంచే నాకు సినిమా మీద ఇష్టం మొదలైంది. ఫ్యామిలీ లో ఎవరికీ సినిమా బ్యాక్ గ్రౌండ్ లేదు. ఒక్కో అడుగు వేసుకుంటూ ఇవాళ దర్శకుడిగా మీ ముందు నిలబడ్డాను. సినిమాకు దర్శకత్వం వహించే ముందు సినిమాటోగ్రఫీ , ఎడిటింగ్ ఇలా మేజర్ ఐదారు క్రాఫ్టులలో నైపుణ్యం తెచ్చుకున్నాను. శుక్ర సినిమాలో సాంగ్స్, ట్రైలర్ లో క్వాలిటీ కనిపిస్తుంది అంటే అది మా టెక్నీషియన్స్ ఇన్వాల్వ్ మెంట్ వల్లే. సినిమాలో ఏది చూసినా చాలా బాగుంది అనిపించాలి అనేది మా గోల్ గా పెట్టుకున్నాం. ఆశీర్వాద్ లూక్ ఇచ్చిన బ్యాగ్రౌడ్ స్కోర్ అదిరిపోయింది. తను చాలా సూపర్ హిట్ చిత్రాలకు పనిచేశారు. శుక్ర అంటే సినిమాలో డైమండ్ అని మీనింగ్ చెబుతున్నాం. సినిమా గతంలో ఏ సినిమాతో పోలిక లేకుండా ఉంటుంది. కొత్తగా ఉంటుంది. శుక్ర మిమ్మల్ని ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తుంది. ఇప్పుడు థియేటర్లు మూసివేత అంటున్నారు కానీ ఏది ఏమైనా మేము మా సినిమాను విడుదల చేయడానికే నిర్ణయించుకున్నాం. ఎన్ని థియేటర్స్, ఎన్ని మల్టిప్లెక్స్ లు దొరికితే అన్నింటిలో శుక్ర విడుదల చేస్తాం. సినిమా మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. శుక్ర సినిమా విడుదలకు సహకరించిన మధుర శ్రీధర్ గారికి థాంక్స్. ఇంకో 10, 15 ఏళ్లు ఇండస్ట్రీలో దర్శకుడిగా ఉంటానన్న నమ్మకం ఉంది. మీరు చూడని ఎన్నో కథలు తెరకెక్కించాలని ఉంది. అన్నారు.
 
చిత్ర తపస్వి పిక్చర్స్ ఇంద్రసేన మాట్లాడుతూ...శుక్ర సినిమా టీమ్ కు నా కంగ్రాంట్స్. శుక్ర అంటే బ్రైట్ నెస్ అని దర్శకుడు చెెప్పారు. ఆ వెలుగు దర్శకుడు సుకు పూర్వజ్, హీరో అరవింద్ కృష్ణలో కనిపిస్తోంది. సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.
 
నటుడు విశాల్ రాజ్ మాట్లాడుతూ...ఈ సినిమాలో నేను ఒక ఇంపార్టెంట్ రోల్ చేశాను. అదేంటని చెప్పను. దర్శకుడు సుకు ఆరేళ్లుగా నాకు తెలుసు. ఈ క్యారెక్టర్ కోసం చాలా మందిని అనుకుని చివరకు నాకు ఇచ్చారు. హీరో అరవింద్ కృష్ణతో షూటింగ్ చేస్తే అదో పార్టీలా ఉంటుంది. మా ఆర్టిస్ట్ ల ఉత్సాహం సినిమాలో చూస్తారు. అన్నారు.
 
హీరోయిన్ శ్రీజిత ఘోష్ మాట్లాడుతూ...శుక్ర సినిమాతో నాకు మంచి డెబ్యూ ఫిలిం దొరికింది. ఈ ఇండస్ట్రీలో ఇంకా చాలా కాలం ఉండాలని కోరుకుంటున్నాను. దర్శకుడు సుకు గారు నాకు పేరు తెచ్చే క్యారెక్టర్ సినిమాలో ఇచ్చారు. నా క్యారెక్టర్ కు న్యాయం చేసేందుకు ప్రయత్నించాను. అలాగే ఇతర కో యాక్టర్స్, టెక్నీషియన్స్ కూడా ఎంతో టాలెంటెడ్ గా వర్క్ చేశారు. అరవింద్ కృష్ణ నటన మీకు బాగా నచ్చుతుంది. మొదటి సినిమా రిలీజ్ అవుతున్న ఎగ్జైట్ మెంట్ లో ఉన్నాను. ఎప్పుడూ చూసే టైప్ సినిమా కాదిది. కొత్తగా ఉంటుంది. అన్నారు.