సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 16 ఏప్రియల్ 2020 (16:10 IST)

రాహుల్ సిప్లగింజ్ లిప్ లాక్ సీన్.. నందినీ రాయ్‌తో ఫుల్ రొమాన్స్.. వీడియో వైరల్

Rahul Sipligunj
బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం రాహుల్‌కు సంబంధించిన లిప్ లాక్ ఫోటో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. రాహుల్ ప్లే బ్యాక్ సింగర్‌గా, ప్రైవేట్ ఆల్బమ్స్‌తో బాగా ఫేమస్ అయ్యాడు. 
 
అయితే బిగ్ బాస్ ద్వారా అతనికి మరింత క్రేజ్ పేరిగింది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన రాహుల్ ఫుల్ బిజీ అయ్యాడు. తాజాగా కృష్ణ వంశీ దర్శకత్వంలో రాబోతోన్న రంగమార్తాండ చిత్రంలో ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. 
 
ఈ నేపథ్యంలో నటి నందినీ రాయ్‌తో ఫుల్ రొమాన్స్ చేస్తున్న వీడియోను రాహుల్ షేర్ చేశాడు. ఈ వీడియోకు అషూ చేసిన కామెంట్ తెగ వైరల్ అవుతోంది. బిగ్ బాస్ హౌస్‌లో అషూ చేసిన అల్లరి వేసిన పంచ్‌లు - రాహుల్‌ను ఆట పట్టించిన విధానం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 
 
తాజాగా ఆషూ బోల్డ్ కామెంట్ చేసింది. లిప్ లాక్‌ సీన్‌ను ఉద్దేశిస్తూ.. వావ్ ఇది నేను చూడలేదంటూ సెటైర్ వేసింది. దీనికి రాహుల్ కూడా స్పందించాడు. ''అబ్బో ఇక నేను చచ్చిపోతా" అంటూ కామెంట్ చేశాడు. మళ్లీ ప్రతీగా స్పందించిన అషూ.. మినిమమ్ ఉంటాయ్ కదా నీ వీడియోస్‌లో అంటూ నవ్వేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.