సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 10 ఏప్రియల్ 2023 (08:44 IST)

మేం ఉత్సవ విగ్రహాలు లాంటివాళ్ళం: కీరవాణి

రెండు తెలుగు రాష్ట్రాల మంత్రుల సమక్షంలో కీరవాణి, చంద్రబోస్‌కు సన్మానం

keravani, chandrbose sanmanam
keravani, chandrbose sanmanam
ఆర్‌.ఆర్‌.ఆర్‌. సినిమాలోని నాటునాటు పాటకు ఆస్కార్‌ వచ్చిన తర్వాత విదేశాలనుంచి రాగానే తెలంగాణ ప్రభుత్వం సన్మానం చేయాలని తలచింది. అయితే ఆంధ్ర రాష్ట్రం నుంచి ఎటువంటి స్పందన లేదు. ఇదేవిషయాన్ని సి.కళ్యాణ్‌ మాట్లాడుతూ, సినిమారంగంలో ఇగోలు అపోహలు వున్నాయి. అవన్నీ పక్కనపెట్టి యావత్‌ తెలుగు సినిమారంగం వారికి సన్మానం చేయాలని ఇందుకు రెండు రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి పూనుకోవాలని మీడియా సమావేశంలో చెప్పారు. ఏదిఏమైనా ఆదివారంనాడు శిల్పకళావేదికలో సన్మానవేడుక జరిగింది. సినీ ప్రముఖులు అందరూ వచ్చారు. రెండు ప్రభుత్వాల మంత్రులు తగు విధంగా సత్కరించారు.
 
keravani, chandrbose sanmanam
keravani, chandrbose sanmanam
ఈ సందర్భంగా కీరవాణి మాట్లాడుతూ,ఎక్కడైనా మూల విగ్రహాలు గుడిలోనే వుంటాయి. వాటి తరఫున ఉత్సవ విగ్రహాలు ఊరేగింపుల్లో హారతులు అందుకుంటాయి. అలా ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డు రావడానికి మూల విగ్రహాలాంటి వ్యక్తులు రాజమౌళి, నృత్యదర్శకుడు ప్రేమ్‌ రక్షిత్‌. ఇలా చిత్రపరిశ్రమ ఈరోజు ఒక్కటిగా చేరడం ఆనందంగా వుంది అన్నారు.
 
చంద్రబోస్‌ మాట్లాడుతూ, ఆస్కార్‌ పురస్కారం అబద్దం లాంటి నిజం. ఒక స్వప్నంలాంటి సత్యం. దాన్ని సాధ్యం చేసిన రాజమౌళికి అతని బృందానికి ధన్యవాదాలు. నా జీవిత గమనాన్ని మార్చింది శ్రీనాథ్‌ అనే మిత్రుడు. సంగీత దర్శకుడు కీరవాణి అంటూ వారి గురించి చెప్పారు. 
ఈ అవార్డులు తెలుగువారు గర్వపడేలా వుందని మంత్రులు పేర్కొన్నారు.