చిరంజీవి మరోసారి తొందరపడుతున్నారా..? చెర్రీ పుట్టినరోజున శ్రీజ పెళ్ళి జరుగుతుందా?
మెగాస్టార్‌గా సినిమారంగంలో ఎదిగిన.. చిరంజీవి.. వ్యక్తిగత జీవితంలో తొందరపడుతున్నారా! అనే అనుమానం సన్నిహితులకు వ్యక్తమవుతోంది. తన రెండో కుమార్తె శ్రీజ వివాహంలో ఆయన తీసుకున్న స్టెప్ ఎలా వుంటుందనేది కుటుంబంలోనూ, అతి సన్నిహితుల్లోనూ చర్చ సాగుతుంది. చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ మొదటి భర్త భరద్వాజ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత చిరు ఫ్యామిలీతోనే ఉంటూ, తన పై చదువులను కూడా పూర్తి చేసుకుంది. యుస్‌లో బెల్లీడాన్స్ను కూడా నేర్చుకుందని ఆ మధ్య వార్తలు కూడా వచ్చాయి.
కాగా, అత్యంత సన్నిహితుల సమాచారం మేరకు చిరంజీవి తన రాజ్యసభ సబ్యుడిగా వుండగా ఓ పారిశ్రామికవేత్తతో ఏర్పడిన పరిచయం స్నేహంగా మారింది. చిత్తూరుకు చెందిన ఓ రెడ్డి కుటుంబంతో వియ్యం అందుకోనున్నారు. ఈ విషయం మాట్లాడడానికి పవన్‌కళ్యాణ్‌ను సర్దార్ గబ్బర్‌సింగ్ సెట్లో కలిశాడు. మరో విషయం ఏమంటే.. తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని పవన్ కల్యాణ్ సూచించినట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా పూర్తిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని హెచ్చరించినట్లు సమాచారం. అప్పటికే వపన్‌కళ్యాణ్ ఓ కుటుంబాన్ని సజెస్ చేశాడని కూడా తెలుస్తోంది. ఏది ఏమైనా.. ఈ విషయంలో మరో సోదరుడు నాగబాబు.. ఆ కుటుంబం గురించి వివరాలు తెలుసుకునే పనిలో వున్నారు. కాగా, అన్ని అనుకూలిస్తే.. రామ్‌చరణ్ పుట్టినరోజై మార్చి 29కు అటుఇటూగా శ్రీజ పెండ్లి జరిగే సూచనలు కన్పిస్తున్నాయి.