Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

ఏప్రిల్ 28 ఏమిజరిగింది!

Written By డీవీ
Updated: సోమవారం, 4 జనవరి 2021 (13:16 IST)
సినీ ర‌చ‌యిత‌ల సంఘం తొలి స‌భ్యుడు, ఆయుర్వేద డాక్ట‌ర్ ఏల్చూరి వార‌సుడు ఏల్చూరి రంజిత్ క‌థానాయ‌కుడిగా మారాడు. ఆయన న‌టిస్తున్న చిత్రం `ఏప్రిల్ 28 ఏమిజరిగింది`. శేర్రి అగర్వాల్  క‌థానాయిక‌. అజయ్, రాజీవ్ కనకాల ముఖ్య పాత్రల్లో న‌టిస్తున్నారు. వి జి ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై వీర స్వామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్ర క‌థ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ట్రైల‌ర్  నారా రోహిత్ విడుదల చేశారు. 
 
హీరో క‌థ‌లో ర‌చ‌యిత‌. త‌ను రాసుకున్న క‌థ‌ను బ‌ట్టి ఓ భ‌వంతిలోకి వెళ్ళ‌గానే అక్క‌డ అత‌నికి జ్ఞాప‌కాలు గుర్తుకువ స్తాయి. అవి ఏమిట‌నేది చిత్రంలో చూడాల్సిందేన‌ని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈనెల‌లో ఈ సినిమాను థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం గురించి ప‌రుచూరి గోపాల‌కృష్ణ, హీరో శ్రీ‌విష్ణులు యూట్యూబ్ వీడియో మాట్లాడుతూ.. ఏల్చూరి వార‌సుడు తీసిన ఈ సినిమా మంచి విజ‌యాన్ని సాధించాల‌ని ఆకాంక్షించారు. 
 
రామానాయుడు స్టూడియోలో ట్రైల‌ర్ ఆవిష్క‌ర‌ణ అనంత‌రం నారా రోహిత్ మాట్లాడుతూ.. రంజిత్ నాకు మంచి స్నేహితుడు. హీరోగా మంచి సినిమాలో తెలుగులో ఆరంభించారు. థ్రిల్ల‌ర్ సినిమాల‌కు మంచి ఆద‌ర‌ణ వుంటుంది. త‌ప్ప‌కుండా ఈ సినిమా విజ‌య‌వంతం కావాల‌ని కోరుకుంటున్నాన‌ని అన్నారు.
 
రంజిత్ మాట్లాడుతూ... అవ‌ధి అనే క‌న్న‌డ సినిమా చేశాను. ఆ త‌ర్వాత గ్యాప్ వ‌చ్చింది. ఇది 2వ సినిమా. తెలుగులో మొద‌టి సినిమా. నిర్మాత సినిమా ముందుకురావ‌డానికి స‌హ‌క‌రించారు. ఈ చిత్ర క‌థ చాలా భిన్నంగా వుంటుంది. గ‌తంలో వ‌చ్చిన థ్రిల్ల‌ర్‌ల కంటే ఆస‌క్తిక‌రంగా వుంటుంది. ద‌ర్శ‌క‌ుడు మ‌లిచిన తీరు అద్భుతంగా వుంది. ఈ జ‌న‌వ‌రిలో సినిమాను విడుద‌ల చేస్తామ‌ని తెలిపారు.

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Custard apples సీతాఫలాలు వచ్చాయి, తినేవారు తెలుసుకోవాల్సినవి

Almonds బాదం పప్పులు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయా?

చక్కెర వ్యాధిని తెచ్చే అలవాట్లు ఇవే...

మహమ్మారులను తట్టుకోగల ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు బాటలు: ఇండియా హెల్త్ ఫార్వర్డ్ 2047

చిన్ననాటి టీకాలతో ఆగిపోకూడదు, అన్ని వయసుల్లో వ్యాక్సినేషన్ అవసరం

తర్వాతి కథనం
Show comments