బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు.. ఆ యంగ్ హీరో ఎవరో?!: సమంత
హీరోయిన్లు ప్రేమించి పెళ్లి చేసుకోవడం పెద్ద విషయం కాదు. ఏడాది క్రితం ఆమె బెల్లంకొండ సురేష్ చిత్రంలో నటించేటప్పుడు పెదాలకు, ముక్కుకు ఏదో ఆపరేషన్ జరిగిందని వార్తలు విన్పించాయి. దాదాపు 8నెలలు విరామం తీసుకుని స్పీడున్నోడు చేసింది. దానితోపాటు సమంత ప్రేమలోకూడా పడిందని గుప్పుమంది. కానీ అడిగినప్పుడల్లా అదేమీలేదని కొట్టిపారేసింది.
అయితే.. తాజాగా ఓ ఆంగ్ల పత్రికలో ఆమె తన వ్యక్తిగతాన్ని పంచుకున్నారు. తనకు బాయ్‌ఫ్రెండ్ వున్నాడని తెలిపింది. ఆయనతో జీవితం సాఫీగా సాగుతోందని, అతడు అన్నివిధాలా తనకు సరైన వాడని తెలిపారు. తనకు అన్ని విషయాల్లోనూ సపోర్ట్‌గా నిలిచే అతడిని త్వరలోనే పెళ్ళి చేసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు సమంత వెల్లడించింది. అయితే తన బాయ్‌ఫ్రెండ్ పేరు చెప్పని సమంత, అతడు తనకు చాలాకాలంగా పరిచయమని, ఓ యువహీరో అని మాత్రం తెలిపారు. సమంత చెప్పిన వ్యక్తి ఎవరో మరి..!